కరోనా వైరస్ మహమ్మారి ఇండియన్ నావీని సైతం వదల్లేదు. ఇండియన్ నావీ ఫోర్స్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. భారతయుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 26 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వీరందరికి ముంబై కొలబాలోని ఇండియన్ నేవీకి చెందిన అశ్వినీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి సమయంలో వీరంతా ఐఎన్ఎస్ యాంగ్రీ కి చెందిన స్థావరాల్లో ఉన్నట్లు సమాచారం.

Also Read : నిరుద్యోగులకు శుభవార్త..టీసీఎస్ లో 40 వేల ఉద్యోగాలు

ఒక్కసారిగా నావికా సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్థారణవ్వడంతో నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ అప్రమత్తమై అన్ని యుద్ధ నౌకల్లో, జలాంతర్గాముల్లో శానిటైజ్ చేయించినట్లు తెలిపారు. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నావికాదళ శిక్ష, సమావేశాలు, ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా పాజిటివ్ వచ్చిన వారితో కలిసి పనిచేసిన వారిని క్వారంటైన్ చేశామన్నారు. మరోవైపు ఆర్మీ సైన్యం లో సైతం 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆర్మీచీఫ్ జనరల్ ఎంఎం నారావణే వెల్లడించారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు, ఒక నర్స్ కూడా ఉన్నట్లు తెలిపారు.

Also Read :ఆమె పై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి ప్లీజ్..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.