5 రూపాయిల ముష్టి కోసం ఎన్ని వెధవ పనులైనా చేస్తారు: నారా లోకేష్

By సుభాష్  Published on  9 May 2020 8:12 AM GMT
5 రూపాయిల ముష్టి కోసం ఎన్ని వెధవ పనులైనా చేస్తారు: నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ నాయకుడు నారా లోకేష్ మీద ఫేక్ పోస్టులు చాలా వస్తూ ఉంటాయి. తాజాగా కూడా అలాంటి ఒక పోస్టుపై నారా లోకేష్ మండిపడ్డారు. నారా లోకేష్ పేరు మీద ఉన్న వాట్సప్ మెసేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పెట్టి అది ఫేక్ ఫోటో అంటూ చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని నారా లోకేష్ "ఫేక్ బతుకులు మారవ్... అధినేత 420 అయితే కార్యకర్తలు అంతకు మించి. @ysjagan వేసే 5 రూపాయిల ముష్టి కోసం ఎన్ని వెధవ పనులు అయినా చేస్తారు.నేరుగా యుద్ధం చేసే దమ్ము లేనివాళ్లకు రాజకీయాలు అనవసరం.మీ డ్రామాలు గన్నేరుపప్పు ముందు వెయ్యండి 5 రూపాయిలు పడేస్తాడు." అంటూ #YCPPaytmBatch అని పోస్టు పెట్టాడు.

తాను చెప్పుకున్నా కూడా నారా లోకేష్ పేరు మీద వైరల్ అవుతున్న వాట్సప్ చాట్ గురించి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు లోకేష్. ఇంతకూ ఆ చాట్ లో ఏముందంటే 'టీడీపీ ముఖ్య నాయకులకు నమస్కారం, నిన్నటి ఘటన తర్వాతా, నాన్న గారు వైజాగ్ వస్తున్నారని స్పెషల్ హెలికాఫ్టర్ లో బయలుదేరారని వస్తున్న వార్తలు అవాస్తవం, కరోనా వ్యాధి తగ్గు ముఖం పట్టే వరకు ఇంట్లోనే ఉంటూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు. ఒకవేళ ఆంధ్రా వస్తే తిరిగి తెలంగాణకు రావడానికి KCR అనుమతి తీసుకోవాలి, KCR ని నాన్నగారు అడగలేరు అర్థం చేసుకొని విస్తృతంగా సేవా కార్యక్రమాలలో పాల్గొనండి. ప్రభుత్వ వైఫల్యాలను తిప్పి కొట్టండి. మన కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మద్యం ధరల గురించి కూడా కరోనా తగ్గాక దీక్ష చేద్దాం, ఎవరూ ఆందోళన చెందవద్దు.'

ఈ వ్యాఖ్యలను నారా లోకేష్ ఎవరితోనూ చెప్పలేదు. సోషల్ మీడియా వీటి గురించి ప్రస్తావించలేదు. కానీ నారాలోకేష్ పేరు మీద వాట్సప్ మెసేజ్ ను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ మెసేజీలో ఉన్నట్లు కూడా అక్కడెటువంటి సంఘటన కూడా జరగలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైజాగ్ కు వచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ వైరల్ అవుతున్న వాట్సప్ స్క్రీన్ షాట్ పచ్చి అబద్ధమని తేలింది. అందుకే నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో ఇది ఫేక్ అని తేల్చేశారు. ఎవరైతే చేస్తున్నారో.. వారి వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

Next Story