లాక్‌డౌన్‌ 5.0లో భారీ సడలింపులు

By సుభాష్  Published on  30 May 2020 4:36 PM GMT
లాక్‌డౌన్‌ 5.0లో భారీ సడలింపులు

దేశ వ్యాప్తంగా కరోనా కొరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య మాత్రం ఏ మాత్రం ఆగడం లేదు. దీంతో ప్రభుత్వాలకు పెద్ద తల నొప్పిగా మారిపోయింది. ఇక లాక్‌డౌన్‌ 4.0 మే 31తో ముగియనుండటంతో దాదాని జూన్‌ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అందుకు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఇక లాక్‌డౌన్‌ 5.0లో భారీగానే సడలింపులు ఇచ్చింది కేంద్రం. ఈ సడలింపులు కూడా జూన్ 8 నుంచి ఇవ్వనుంది.

ప్రార్థనా స్థలాలు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు సహా అనేక మినహాయింపులు ప్రకటించింది. కొన్నింటికి మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ లిస్ట్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైలు సేవలు, సినిమా థియేటర్లు, జిమ్, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్‌, ఇతర మతపరమైన సమావేశాలు ఉన్నాయి. అయితే ఇవి పరిస్థితులను బట్టి అనుమతులు ఇస్తామని కేంద్రం తెలిపింది.

ఇక రాత్రి వేళల్లో విధించే కర్ఫ్యూలోనూ కేంద్రం సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఉండేది. ఇక కేంద్రం తాజా నిర్ణయంతో ఇక రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ పరిమితం చేస్తూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story