ఢిల్లీ: భారత రాజకీయాల్లో కురు వృద్దుడు, భారతీయ జనతా పార్టీ పునాది.  బీజేపీలో వాజ్ పేయి అంతటి ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు ఈ రోజు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తమ నేతను కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. నేటితో అద్వానీకి 92 ఏళ్లు.

జన సంఘ్‌గా ఉన్న భారతీయ జనతాపార్టీని తనదైన శైలిలో ముందుకు నడిపించిన రాజకీయ వ్యూహకర్త అద్వానీ, రెండు సీట్లుగా ఉన్న పార్టీ ఈ రోజు తిరుగులేకుండా అధికారంలో ఉందంటే అద్వానీ చలువే. రథయాత్రతో భారత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు.

వాజ్‌ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే..మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యారు అద్వానీ. కాని..బీజేపీలో ఎవరైనా ఆయన ఆశీర్వాదంతో పైకి వచ్చిన వారే అని చెప్పాలి.

Image

Image

Image

Image

Image

Image

 

Image

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.