హైదరాబాద్‌: బేగంపేట్‌లోని లిస్బన్‌ పబ్‌లో రోజు రోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. లిస్బన్‌ పబ్‌ యాజమాన్యం గలీజ్‌ దందాకు పాల్పడుతున్న అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. లిస్బన్‌ పబ్‌లో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది.. పబ్‌లో డ్యాన్సర్‌పై యాజమాని మురళీకృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లో వరుస ఘటనలు జరిగిన పబ్‌పై ఎక్సైజ్‌ శాఖ అధికారుల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు.

లిస్బన్‌ పబ్‌లో యాజమాన్యం.. యువతులతో అశ్లీల డ్యాన్స్‌లను చేయిస్తున్నారు. అక్కడికి వచ్చే వారిని ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తే మరిన్ని డబ్బులు ఇస్తామంటూ యువతులకు గాలాలు విసురుతున్నారు. యువకులతో మద్యం కొనుఓలు చేయిస్తే భారీ నజరానాలు ఇస్తామని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే పలు మార్లు లిస్బన్‌ పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు కూడా చేశారు. పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలు సైతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

2019 డిసెంబర్‌ 18న లిస్బన్‌ రెస్టోబార్‌ అండ్‌ పబ్‌పై బుధవారం రాత్రి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతోనే పబ్‌పై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్‌లో నిర్వహకుల్లోని ముగ్గురు వ్యక్తులు అసభ్యకర చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో 30 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు. లిస్బర్‌ రెస్టోబార్‌కు ఎక్కువగా జులాయిగా తిరిగేవారే హాజరువుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

2019 జూన్‌లో పబ్‌లో డ్యాన్సర్‌ చేత వ్యభిచారం చేయించాలని పబ్‌ నిర్వహకుడు ప్రయత్నించాడు. అయితే ఆ డ్యాన్సర్‌ ఎంతుకు ఒప్పుకోకపోవడంతో ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort