తెరుచుకున్న మద్యం షాపులు.. బారులు తీరిన మందుబాబులు.. ఎక్కడంటే..
By సుభాష్ Published on 28 April 2020 2:19 PM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తోంది.ఈ వైరస్ అన్ని దేశాల్లో వ్యాపించడంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌక్ విధించారు. దీంతో అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. ఇక మద్యం షాపులు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా.. అని మద్యం ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మద్యం షాపులు తెరుచుకున్నాయి. మద్యం షాపులో కాదు బార్లు సైతం తెరుచుకున్నాయి. అయితే మద్యం షాపులు తెరిచింది మన దేశంలో కాదు. చైనా దేశంలో డ్రాగన్ కంట్రీ.
కరోనాకు పుట్టినిల్లు అయిన వుహాన్ నగరంలో మళ్లీ మద్యం షాపులు తెరుచుకున్నాయి. 2019లో వైరస్ విజృంభించగా, ఇప్పుడు మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు వచ్చాయి. వూహాన్ ఇప్పుడు కరోనా ఫ్రీ సిటీ కావడంతో డ్రాగన్ కంట్రీలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. ప్రస్తుతం ప్రజలు ఎప్పటిలాగే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ట్రాన్స్‌పోర్ట్, రైళ్లు, బస్సులు ఇతర రవాణా సదుపాయాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో జన సంచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్నో రోజులుగా మూతపడిన మద్యం షాపులు, బార్లు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు బారులు తీరారు. మద్యం షాపుల ముందు భారీ సంఖ్యలో క్యూలైన్ కట్టారు.