అమరావతి: లింగమనేని ప్రాజెక్ట్స్‌ దివాలా వార్తలపై ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ క్లారిటీ ఇచ్చారు. తమ సంస్థను దివాలాగా ప్రకటించాలని తామెప్పుడూ కోరలేదని వెల్లడించారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఓయిర్‌ కోస్తా ఒప్పందంలోని కొన్ని సమస్యలు వచ్చాయని లింగమనేని రమేష్‌ తెలిపారు. వాటిని పరిష్కరించుకునే లోపే సదరు సంస్థ లా ట్రైబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ వేసింది. జర్మన్‌ సంస్థ పిటిషన్‌ ఆధారంగా కంపెనీస్‌ లా ట్రైబ్యునల్‌ మధ్యంతరం ఉత్తర్వులు జారీ చేసిందని లింగమనేని రమేష్‌ తెలిపారు. ఈ వ్యవహారంతో ఎల్‌ఈపీఎల్‌లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మా ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, గతంలో మా రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఎప్పుడూ రాలేదని లింగమనేని రమేష్‌ తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.