నిలబడి పని చేసినా బరువు తగ్గుతారా?
బరువు పెరగడం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీని నుంచి బయటపడటానికి రకరకాల డైట్ ప్లాన్స్...
By - అంజి |
నిలబడి పని చేసినా బరువు తగ్గుతారా?
బరువు పెరగడం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీని నుంచి బయటపడటానికి రకరకాల డైట్ ప్లాన్స్, ఫిజికల్ ఎక్సర్‌సైజులు చేయడం వంటివి అనుసరిస్తున్నారు. అయితే రోజులో కొంత సమయం నిలబడి పని చేయడం వల్ల కూడా బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు. గంటల తరబడి కూర్చొని ఉండేకన్నా.. రోజులో కనీసం రెండున్నర గంటల పాటు నిల్చొని ఏదో పని చేయడం వల్ల బరువు పెరిగే ముప్పు కొంత వరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. నిలబడి ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది.
గంటసేపు నిలబడితే 50 కేలరీల వరకు ఖర్చవుతాయి. రోజులో మూడు గంటలు నిలబడి పని చేసేవారిలో కేలరీల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా తిన్న తర్వాత కాసేపు నడిస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమై మన శక్తిని పెంచి ఊబకాయ ముప్పును తగ్గిస్తుంది. నిలబడి ఫోన్ మాట్లాడటం, గిన్నెలు కడగడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు కోయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, స్నేహితులతో నిలబడి కబుర్లు చెప్పుకోవడం వంటివి కూడా మన ఒంట్లో కేలరీలు ఖర్చు కావడానికి కారణమై మన శరీర బరువును నియంత్రించడంలో లేదా తగ్గించడంలో సాయపడతాయట.