వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి టోపీ ధరిస్తారు. అలాగే బైక్‌లపై బయటకు వెళ్లేటప్పుడు సేఫ్టీ కోసం హెల్మెట్ ధరిస్తుంటారు. అయితే కొందరు టోపీ, హెల్మెట్ ఎక్కువగా ధరిస్తే జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువై, బట్టతల వస్తుందని అనుకూంటూ ఉంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అని వైద్యులు చెబుతున్నారు. టోపీ, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టురాలి బట్టతల రాదంటున్నారు. ఎండవల్ల జుట్టు వేడెక్కి ఊడిపోకుండా ఉండేందుకు ధరించే టోపీ వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుంది తప్ప ఊడదని చెబుతున్నారు.
అయితే మరీ బిగుతుగా ఉండే టోపీలు వాడకపోవడం మంచిదని.. కాస్త జుట్టుకు గాలి తగిలేలా చూసుకోవాలి సూచిస్తున్నారు. అలాగే హెల్మెట్ వల్ల జుట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు. బట్టతల రావడానికి జన్యుపరమైన కారణాలు ఉంటాయి. హార్మోన్లలో మార్పులు, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, జుట్టు వెంట్రుకల మూలాలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఉంది. టోపీ, హెల్మెట్ ధరించడం వల్ల జుట్టుకు ఎలాంటి హాని ఉండదు. జుట్టు రాలుతుందనే అపోహతో హెల్మెట్ ధరించడం మానేస్తే దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగితే ప్రాణానికే ప్రమాదం.