బిర్యానీ తిన్నాక దాహం ఎందుకు వేస్తుందంటే?

బిర్యానీ పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. అయితే బిర్యానీ తిన్నాక చాలా సేపటి వరకు ఒకటే దాహం వేస్తుంది.

By అంజి  Published on  31 March 2024 8:39 AM IST
thirsty, eating, biryani

 బిర్యానీ తిన్నాక దాహం ఎందుకు వేస్తుందంటే?

బిర్యానీ పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. అయితే బిర్యానీ తిన్నాక చాలా సేపటి వరకు ఒకటే దాహం వేస్తుంది. ఇదే కాదు ఫంక్షన్స్‌కి, చుట్టాల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ వండే పలావ్‌, బగారా తిన్నా, ఆయిల్‌ ఫుడ్స్‌ అంటే ఫ్రైస్‌ తిన్నా దాహం వేస్తుంది. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఈ ఆహారాల్లో ఎక్కువ శాతంలో కొవ్వు ఉంటుంది. ఇది జీర్ణం అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఇది జీర్ణం అయ్యే ప్రక్రియలో శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత తాగినా దప్పిక తీరదు.

ఇలాంటి సందర్భంలో కొన్ని గోరు వెచ్చని నీటిని తాగితే ఉపశమనం ఉండొచ్చు. అంతే కాదు ఈ వంటకాల్లో ఉప్పుశాతం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మూలాన దాన్ని బ్యాలెన్స్‌ చేసేందుకు శరీరం నీటిని ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. అందుకే వెజ్ బిర్యానీ లేదా నాన్ వెజ్ బిర్యానీ, అధికంగా ఆయిల్ ఫుడ్ తీసుకున్న వారికి దాహం ఎక్కువగా వేస్తుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో సుమారుగా 90 శాతం నీరు ఉంటుంది. అందుకే నీటిశాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Next Story