చదువుకుందామని బుక్ ఓపెన్ చేసే చాలా మందికి కొద్దిసేపటికే నిద్ర వస్తుంటుంది. అయితే ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. చదివేటప్పుడు నిద్ర రావడం అనేది మనం ఏ భంగిమలో కూర్చున్నాం, ఎంతసేపటి నుంచి చదువుతున్నాం.. అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. చదివేటప్పుడు శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల కండరాలకు ప్రవహించే రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో శరీరంలోని జీవకణాల్లో దహన చర్య మందగించి, లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది.
అయితే మనం పీల్చుకునే ఆక్సిజన్‌ను ఎక్కువ మొత్తంలో ఈ యాసిడ్ ఉపయోగించుకుంటుంది. తద్వారా రక్తానికి కావాలసినంత ఆక్సిజన్ అందదు. అలా ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల కాస్త మత్తుగా అనిపిస్తుంది. అందుకే మనకు నిద్ర వస్తున్నట్టు ఫీల్ కలుగుతుంది. కాబట్టి.. ఏకాగ్రతతలో చదవాలనుకున్నప్పుడు ఒకే భంగిమలో కాకుండా.. అప్పుడప్పుడు అటూ ఇటూ కదలాలి. ఏకబిగిన చదవకుండా.. మధ్యలో గ్యాప్ ఇవ్వాలి.