బరువును తగ్గించే బ్రేక్‌ఫాస్ట్‌లు ఏవో మీకు తెలుసా?
చాలా మంది బరువు తగ్గటం పేరుతో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. అది మీ సమస్యను తీర్చకపోగా.. కొత్త సమస్యలను
By అంజి Published on 6 April 2023 3:15 PM ISTబరువును తగ్గించే బ్రేక్‌ఫాస్ట్‌లు ఏవో మీకు తెలుసా?
చాలా మంది బరువు తగ్గటం పేరుతో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. అది మీ సమస్యను తీర్చకపోగా.. కొత్త సమస్యలను తీసుకొస్తుందని, కొన్ని రకాల అల్పాహారాల సాయంతో బరువు తగ్గడం సులభమనీ నిపుణులు సూచిస్తున్నారు. ఆ ప్రొటీన్‌రిచ్ అల్హాహారాల వివరాలు ఇప్పుడు మీకోసం..
శనగల సలాడ్
శనగలు మంచి ప్రొటీన్ ఫుడ్. నానబెట్టిన శనగలను కుక్కర్‌లో ఓ విజిల్ వచ్చేలా ఉడికించి వాటిలో టమాటో, ఉల్లితరుగు, గుప్పెడు దానిమ్మ గింజలు, క్యారెట్ కలిపి చివరలో కొంచెం.. ఉప్పు, కారం, నిమ్మరసం చల్లి తింటే కడుపు నిండిన ఫీలింగ్‌తో బాటు బరువూ తగ్గొచ్చు.
పాలకూర సలాడ్
బరువు తగ్గించడంలో పాలాకూర బాగా పనికొస్తుంది. పాలకూర ఆకులను చిన్న ముక్కలుగా చేసి అందులో యాపిల్, పన్నీర్ ముక్కలు, వాల్‌నట్స్ వేసి కలిపి, కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి రోజూ సలార్ రూపంలో తీసుకుంటే బరువు తగ్గొచ్చు.
బ్రకోలి, ఎగ్ సలాడ్
ముందుగా కొద్దిగా ఉల్లితరుగు, మిర్చి ముక్కలు వేసి నూనెలో వేయించి దానిలో ఉడికిన గుడ్డును ముక్కలుగా వేయాలి. దీనిలో బ్రకోలీ, అరటి, యాపిల్ ముక్కలు కలిపి లేదా విడిగానైనా తినొచ్చు. ఇది తగినన్పి ప్రోటీన్స్‌ను అందించి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
ఫ్రూట్ సలాడ్
పండ్లు తింటూ కూడా బరువు తగ్గొచ్చు. బొప్పాయి, జామ, యాపిల్, అరటి పండ్ల ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా, తేనె కలిపి రోజూ బ్రేక్ ఫాస్ట్ టైంలో తీసుకొవచ్చు. పుల్లని, తియ్యని పండ్లు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు రావొచ్చు.
మొలకల సలాడ్
స్ప్రౌట్స్ నేరుగా తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే వీటిని ఆవిరిమీద 10 నిమిషాలు ఉడికించి అందులో ఉల్లి, టమోటా, కీరదోస తరుగుతో పాటు రెండు పాలకూర ఆకు తరుగు కలిపి చివరలో కారం, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం కలిపి సలాడ్‌లా తింటే బరువు తగ్గొచ్చు.
మెక్సికన్ సలాడ్
ఓ బౌల్‌లో పాలకూర తరుగు, బ్లాక్ బీన్స్, కార్న్ గుప్పెడు చొప్పున తీసుకుని టామాట సాస్ వేసుకుని ఆ సలాడ్‌ను తింటే బరువు తగ్గొచ్చు.