బెల్ట్‌ మరీ టైట్‌గా ధరిస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే

చాలా మందికి ప్యాంట్‌ను బెల్టుతో ధరించే అలవాటు ఉంటుంది. సన్నగా ఉన్న వారికి అయితే బెల్టు తప్పనిసరి. ప్యాంటు జారిపోకుండా ఉండటానికి బెల్టును పెట్టుకుంటారు.

By అంజి  Published on  6 Jun 2024 12:00 PM GMT
belt, Lifestyle, Health problems

బెల్ట్‌ మరీ టైట్‌గా ధరిస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే

చాలా మందికి ప్యాంట్‌ను బెల్టుతో ధరించే అలవాటు ఉంటుంది. సన్నగా ఉన్న వారికి అయితే బెల్టు తప్పనిసరి. ప్యాంటు జారిపోకుండా ఉండటానికి బెల్టును పెట్టుకుంటారు. కొందరికి బెల్టులను చాలా టైట్‌గా ధరించే అలవాటు ఉంటుంది. అయితే నడుం దగ్గర చాలా టైట్‌గా పట్టే ప్యాంటును గానీ, మరీ టైట్‌గా బెల్టును గానీ ధరిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైట్‌గా బెల్ట్‌ పెట్టుకోవడం వల్ల నడుము, పొత్తికడుపులో తిమ్మిరి కలుగుతుంది. బిగుతుగా ఉండే బెల్ట్‌ మీ కడుపుపై ఒత్తిడి తెస్తుంది.

దీని వల్ల కడుపులోని ఆమ్లం గొంతులోకి చేరి కొన్నిసార్లు ఎసిడిటీ సమస్యలు వస్తాయి. బెల్ట్‌ను మహిళలు టైట్‌గా ధరించడం వల్ల కటి ప్రాంతంపై ఒత్తిడి ఏర్పడి పునరుత్పత్తి అవయవాలు ప్రభావితమై సంతానోత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బిగుతుగా బెల్టులను ధరించడం వల్ల వెన్నముకపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని బెల్ట్‌లను టైట్‌గా ధరించకపోవడం శ్రేయస్కరం, బట్టలను తీసుకునేటప్పుడు మనకు సరిగ్గా సరిపోయేవి తీసుకుంటే.. ఈ సమస్య రాదు.

Next Story