ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి ఇదే

Travel.. Chand baori world largest step well. ఎత్తయిన కోటలను తిరగేసి భూమిలో లోతుగా నిర్మించినట్లు కనిపించే భారీ నిర్మాణాలు భారతదేశంలో

By అంజి  Published on  23 Dec 2022 5:00 PM IST
ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి ఇదే

ఎత్తయిన కోటలను తిరగేసి భూమిలో లోతుగా నిర్మించినట్లు కనిపించే భారీ నిర్మాణాలు భారతదేశంలో చాలా చోట్ల కనిపిస్తాయి. వీటినే మెట్లబావులు అని అంటారు.ప్రపంచములోనే అతి పెద్ద మెట్ల బావి 'చాంద్‌‌ బవోరి'. వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ మెట్ల బావి,ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీని ప్రాచీనతే దీనిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చే విధంగా చేసింది.మరి అంతటి గొప్ప కట్టడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

'చాంద్‌‌ బవోరి' చరిత్ర

రాజస్థాన్‌లోని 'అభనేరి'లో 8-9 శతాబ్దాల మధ్య కాలంలో రాజపుత్ర పాలకుడు రాజా చందా నిర్మించిన ఈ మెట్లబావి 3,500 మెట్లతో అద్భుతంగా చెక్కిన శిల్పంలా ఉంటుంది. అందుకే దీన్ని 'చాంద్‌‌ బవోరి'అంటారు. ఈ మెట్ల బావి సుమారు 100 అడుగుల లోతు ఉంటుంది. కచ్చితమైన కొలతలతో, ఆధునిక ఇంజినీరింగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఈ బావిని నిర్మించారు. దీనికి మూడు వైపులా మెట్లు ఉంటాయి. నాలుగో వైపు అందంగా అలంకరించిన బాల్కనీలు ఉంటాయి. ఏడాది పొడవునా ఈ బావిలో నీళ్లు ఉంటాయి.ఎప్పుడూ ఎండిపోయింది లేదు. ఈ మెట్ల భావిని కరువు పీడిత ప్రాంతాలలో ఏడాది పొడవునా నీటిని అందించే ఉద్దేశంతో నిర్మించారు.

హర్షత్ మాత దేవాలయం

ఈ మెట్ల బావి దగ్గర చాంద్ హర్షత్ మాత దేవాలయం కలదు. ప్రతి సంవత్సరం హర్షత్ మాత దేవాలయంలో మూడు రోజులపాటు జాతర నిర్వహిస్తారు. ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించేందుకు ఎటుంవంటి ప్రవేశ రుసుము లేదు. 'ది ఫాల్', 'ది డార్క్ నైట్ రైసెస్' వంటి చిత్రాలలో ఈ మెట్ల బావిని చూడవచ్చు.


Next Story