గోవా మాత్రమే కాదు.. దేశంలోని ఈ 5 బీచ్‌లు కూడా న్యూఇయర్ వేడుకలకు సరైనవి..!
2024 సంవత్సరం దాదాపు ముగియనుంది. 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 6:30 PM IST2024 సంవత్సరం దాదాపు ముగియనుంది. 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గోవా న్యూ ఇయర్ పార్టీలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడి బీచ్‌లల న్యూ ఇయర్ జరుపుకోవడాన్ని ప్రజలు చాలా ఆనందిస్తారు. ఈ ప్రదేశం నైట్ లైఫ్, న్యూ ఇయర్ పార్టీలకు సరైన ప్లేస్.
చాలా మంది ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే కొత్త సంవత్సరం నాడు ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది.. కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. ఫ్లైట్‌లు, హోటల్ రూమ్‌ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీన్ని అందరూ భరించలేరు.
మీరు న్యూ ఇయర్ సందర్భంగా బీచ్‌లో పార్టీ చేసుకోవాలనుకుంటే.. దేశంలోని కొన్ని బీచ్‌ల గురించి తెలుసుకొండి. మీరు కుటుంబం, స్నేహితులు, జంటలుగా, ఎవరితోనైనా ఇక్కడకు వెళ్లవచ్చు. ఆ బీచ్‌ల గురించి తెలుసుకుందాం..
గోకర్ణ, కర్ణాటక
మనం గోవా బీచ్ ప్రత్యామ్నాయం కోసం చూస్తే.. కర్ణాటకలోని గోకర్ణం సరైన గమ్యస్థానం. ఈ ప్రదేశం ప్రశాంతతకు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు ఓం బీచ్, కుడ్లే బీచ్, హాఫ్ మూన్ బీచ్‌లలో న్యూ ఇయర్ పార్టీని జరుపుకోవచ్చు. ఇక్కడ పార్టీ చేసుకుంటే.. నూతన సంవత్సరం మరింత గుర్తుండిపోతుంది. ఇక్కడ ఫోటోల కోసం యుత ఎగబడతారు. సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు చాలా అందంగా వస్తాయి.
రాధానగర్ బీచ్, అండమాన్
అండమాన్ రాధానగర్ బీచ్ ఆసియాలోని అతిపెద్ద సముద్ర తీరాలలో ఒకటి. ఇక్కడ ఉన్న తెల్లని ఎడారి, స్ఫటిక స్వచ్ఛమైన నీరు, పచ్చదనం నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి సరైన ప్రదేశంగా చెబుతారు. మామూలుగా ఐతే ఇక్కడకు చాలా తక్కువ మంది వస్తారు. నూతన సంవత్సరం వేళ ఇక్కడ అనేక వాటర్ స్పోర్ట్స్‌ని కూడా ఆస్వాదించవచ్చు.
కన్యాకుమారి బీచ్, తమిళనాడు
అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కన్యాకుమారి బీచ్‌లో కలుస్తాయి. నూతన సంవత్సరంలో సూర్యోదయం, సూర్యాస్తమయంకు సంబంధించి అందమైన దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ప్రతి సంవత్సరం ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చే ప్రజల రద్దీ ఎక్కువ. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది.
మాండ్వి బీచ్, గుజరాత్
శాంతి. ప్రశాంతతను కోరుకునే వారందరికీ గుజరాత్‌లోని మాండ్వి బీచ్ సరైన గమ్యస్థానం. ఇక్కడ మీరు ఒంటె సవారీని ఆస్వాదించవచ్చు. మీరు సూర్యాస్తమయం అందమైన దృశ్యాలను చూడవచ్చు. న్యూ ఇయర్ జరుపుకోవడానికి ఇది కూడా సరైన ప్రదేశం.
చెరాయ్ బీచ్, కేరళ
కేరళలోని చెరాయ్ బీచ్ పర్యాటకులకు మొదటి ఆప్షన్. ప్రకృతి ప్రేమికులు నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇక్కడకు వెళ్లవచ్చు. ఇక్కడ సముద్రపు అలలు మిమ్మల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి. మీరు గోవా కాకుండా వేరే ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే.. ఈ బీచ్ ఉత్తమంగా ఉంటుంది.