ముఖంపై ముడతలు తగ్గాలంటే.. ఇలా చేయండి
వయసుతో పాటు చర్మం తన సహజ సాగే గుణాన్ని కొల్పోయి ముఖంపై ముడతలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు చాలా మందికి వయసు..
By - అంజి |
ముఖంపై ముడతలు తగ్గాలంటే.. ఇలా చేయండి
వయసుతో పాటు చర్మం తన సహజ సాగే గుణాన్ని కొల్పోయి ముఖంపై ముడతలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు చాలా మందికి వయసు మీద పడటానికి ముందే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, సరైన సమయానికి తినకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం, స్వీట్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, నిద్రలేమి, ఆలస్యంగా పడుకోవడం వంటి కారణాలతో ముఖంపై ముడతలు, వృద్ధ్యాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
తాజా కలబంద గుజ్జును తీసుకుని ముఖానికి నేరుగా అప్లై చేసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖంపై మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి.
స్వచ్ఛమైన తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
బొప్పాయి పండు గుజ్జును కూడా నేరుగా ముఖానికి అప్లై చేస్తే ముడతలు, మచ్చలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ముఖం, మెడ, మోచేతులపై రాత్రి పూట అప్లై చేయాలి. ఉదయం కడిగేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖంపై ముడతలతో పాటు, మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్రీ ర్యాడికల్స్ దీనికి కారణం.