భర్త బద్ధకంగా ఉన్నారా?.. ఈ టిప్స్ పాటించండి
ప్రేమ వివాహమైనా.. పెద్దలు చేసిన వివాహంలో అయిన కొంతమంది మహిళలు ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో తీరిక లేకుండా గడుపుతుంటారు.
By అంజి Published on 17 May 2024 4:19 PM ISTభర్త బద్ధకంగా ఉన్నారా?.. ఈ టిప్స్ పాటించండి
ప్రేమ వివాహమైనా.. పెద్దలు చేసిన వివాహంలో అయిన కొంతమంది మహిళలు ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో తీరిక లేకుండా గడుపుతుంటారు. కొంతమందికి వారి భర్త ఇంటి పనిలో సహాయం చేస్తుంటే.. మరికొంత మంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతుంటారు. అలా భాగస్వామి బద్ధకంగా ఉంటే ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. మరి, ఇలా జరగకుండా బంధాన్ని నిలుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.. అదెలాగో తెలుసుకుందాం రండి.
ఆడుతూ.. పాడుతూ..
ప్రస్తుత బిజీ లైఫ్‌లో భార్యభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇంటి పనిలో కూడా ఇద్దరూ భాగస్వాములు అయితే బాగుంటుంది. కనుక ఏ పనైనా ఇద్దరూ పంచుకొని చేయండి. ఈ సమయంలో మనసులోని మాటలను పంచుకోండి. ఫలితంగా పని త్వరగా పూర్తి అవ్వడమే కాదు.. ఇద్దరూ కలిసి ఇలా సమయం గడపడం వల్ల మీ దాంపత్య బంధమూ బలపడుతుంది.
అభినందించండి
చేసిన పనికి ప్రశంసలు దక్కితే వారు తమ పనిని మరింత ఉత్సాహంగా చేస్తుంటారు. భర్తల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కనుక పని చేయలేదని పేచీ పెట్టుకోవడానికి బదులుగా వారు చేసిన పనిని ప్రశంసించండి. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.
మీరే కారణమా?
కొంతమంది మహిళలు ఇంట్లో పని, ఆఫీసు పని భర్త సహకారం లేకుండా ఒక్కరే పూర్తి చేసుకుంటారు. దీంతో మగవారు బద్ధకంగా మారిపోతారు. కాబట్టి, మీకు అన్ని పనులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్ని పనులను మీ భర్తకు అప్పగించడం మంచిది. తద్వారా మీకూ కాస్త సమయం దొరుకుతుంది.
సూపర్ హీరోను చేయండి
బద్ధకపు భర్తల దగ్గర రివర్స్ సైకాలజీని అప్లై చేయండి. కొన్ని రకాల పనులు అప్పగించి.. ఈ పనులు మీరు మాత్రమే చేయగలుగుతారు అని వారిని ప్రోత్సహిస్తూనే వారికి సూపర్ హీరో టైటిల్ ఇవ్వండి. దీంతో మీ భర్త సూపర్ హీరో ఇమేజ్‌ను కాపాడుకోవడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఆ పనిని క్రమం తప్పకుండా చేస్తారు.