వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శరీరం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. అయితే కొందరిలో చెమట దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. అందువల్ల నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే..
- ఖాదీ సిల్క్ వస్త్రాలు చెమటను పీల్చుకుంటాయి. దీని వల్ల చెమటకు కారణమయ్యే బ్యాక్టీరియా శరీరంపై చేరదు.
- ఎక్కువ నీటిని తాగాలి. అప్పుడే మలినాలన్నీ బయటకు పోయి శరీరం తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. నీరు తగినంత తాగకపోతే శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. దీని వల్ల చెమట వాసన వస్తుంది.
- స్నానం చేసిన వెంటనే పౌడరు చల్లుకోవడం మానేసి, తేలికపాటి మాయిశ్చరైజర్ మెడ, చేతులకు రాసుకోవాలి.
- కాఫీ, టీలు తాగడం తగ్గించి, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, తాజా నీళ్లు ఎక్కువగా తాగాలి.
- స్నానం చేసే నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని, ఆ నీటితో స్నానం చేస్తే చెమట వాసన రాదు.