రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చొని పని చేస్తున్నారా?.. ఈ టిప్స్‌ మీ కోసమే

ఈ రోజుల్లో ప్రతీది కంప్యూటర్‌తోనే నడుస్తుంది. దీంతో చాలా ఉద్యోగులు కూడా కంప్యూటర్‌ ముందు కూర్చొనే పని చేస్తుంటారు.

By అంజి  Published on  24 March 2023 2:49 PM IST
Lifestyle, computer work

రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చొని పని చేస్తున్నారా?.. ఈ టిప్స్‌ మీ కోసమే

ఈ రోజుల్లో ప్రతీది కంప్యూటర్‌తోనే నడుస్తుంది. దీంతో చాలా ఉద్యోగులు కూడా కంప్యూటర్‌ ముందు కూర్చొనే పని చేస్తుంటారు. చాలా మంది రోజులో 8 నుంచి 9 గంటల పాటు కంప్యూటర్‌ ముందు కూర్చొని పని చేస్తుంటారు. అయితే.. రోజంతా ఒకే భంగిమలో కూర్చొని పని చేయడం వల్ల కంటి, వెన్ను సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

- కంప్యూటర్‌ స్క్రీన్‌, మీ చూపు రెండు సమాంతరంగా ఉండాలి. ఎక్కువ సేపు కిందికి చూస్తూ పని చేస్తే మెడ, వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ దృష్టి కోణానికి 10 డిగ్రీలకు మించి దిగువకు చూడనివిధంగా కంప్యూటర్‌ స్క్రీన్‌ సెట్‌ చేసుకోవడం చాలా ఉత్తమం

- రోజంతా కంప్యూటర్‌ ముందే కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి. వాటర్‌ బాటిల్‌ డెస్క్‌టాప్‌ దగ్గరే పెట్టుకోవడానికి బదులు మీరే లేచి వెళ్లి.. నీరు తాగితే.. శరీరం రిలాక్స్‌ అవుతుంది. దాంతో పాటు డీహైడ్రేషన్‌ కూడా రాదు.

- ఆఫీస్‌లో లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం చాలా మంచిది. ఇలా నాలుగైదు సార్లు మెట్లు ఎక్కితే.. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

- కళ్లు స్ట్రైయిన్‌ కాకుండా 20 - 20 - 20 రూల్‌ ఫాలో కావాలి. అంటే.. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలోని దృశ్యాన్ని 20 సెకన్ల పాటు చూడాలి. ఇది కంటి కండరాలకు చక్కని ఎక్సర్‌సైజ్‌గా పనికొస్తుంది.

- ఆఫీసులోని మనకు కేటాయించే గదిలో వెలుతురుకు తగ్గట్లుగా కంప్యూటర్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను మార్చుకోవాలి. అక్షరాల ఫాంట్‌ సైజ్‌ కూడా కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల మన కళ్లు ఒత్తిడికి గురికావు.

- కాంటాక్ట్‌ లెన్స్‌ వాడేవారు వాటిని తీసి పనిచేయడమే బెటర్‌. లేకుంటే కళ్లు పొడిబారతాయి. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది.

- స్క్రీన్‌పైకి వంగి పనిచేయకూడదు. తిన్నగా కూర్చుని, భుజాలను వెనక్కిలాగి అరచేతులు భూమికి సమాంతరంగా ఉండేలా కీబోర్డ్‌ని వాడాలి. దీని వల్ల వెన్ను మీద ఒత్తిడి పడదు.

- గంటకోసారి సీట్‌ లోంచి లేచి అటూ ఇటూ నడవాలి. దీని వల్ల పని ఒత్తిడే గాక శరీరం మీది ఒత్తిడి కూడా దూరం అవుతుంది.

Next Story