ఇయర్‌ బడ్స్‌ వాడుతున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే

స్మార్ట్‌ఫోన్‌ వాడే చాలా మంది తప్పనిసరిగా ఇయర్‌ బడ్స్‌ వాడుతుంటారు. ఒకప్పుడు కేవలం పాటలు వినడానికే దీన్ని పరిమితంగా వాడగా.. సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక బ్లూటూత్‌ ఇయర్‌ బడ్స్‌ వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

By అంజి  Published on  15 Oct 2024 4:03 AM GMT
ear buds, precautions,  Life style, Earphones

ఇయర్‌ బడ్స్‌ వాడుతున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే

స్మార్ట్‌ఫోన్‌ వాడే చాలా మంది తప్పనిసరిగా ఇయర్‌ బడ్స్‌ వాడుతుంటారు. ఒకప్పుడు కేవలం పాటలు వినడానికే దీన్ని పరిమితంగా వాడగా.. సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక బ్లూటూత్‌ ఇయర్‌ బడ్స్‌ వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే బ్లూటూత్‌ ఇయర్‌ బడ్స్‌ను రోజులో ఎక్కువసేపు వాడితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి సమస్య వస్తుందని, లోపలి చెవిలో నొప్పి, చిరాకు, చెవిలో బ్యాక్టీరియా పెరిగే ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని చిన్నారులు, గర్భిణులు చాలా పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

- బ్లూటూత్‌ ఇయర్‌ బడ్స్‌, ఇయర్‌ ఫోన్స్‌ వాడేవారు ఎప్పుడూ.. మరీ ఎక్కువ శబ్దం కాకుండా తక్కువ శబ్దంతోనే దాన్ని వాడాలి.

- ఉద్యోగం రీత్యా ఎక్కువసేపు ఇయర్‌ ఫోన్స్ వాడాల్సి వస్తే మధ్యలో కొంత సమయం గ్యాప్‌ ఇవ్వాలి.

- ఇయర్ బడ్స్‌ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. లేకుంటే దుమ్ము, ధూళి, చెమట, వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.

- ఒక రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇయర్‌ బడ్స్ వాడకుండా చూసుకోవాలి.

- ఇయర్‌ ఫోన్‌లు చిన్నగా చెవిలో సరిపోయేటట్టు ఉంటాయి. హెడ్‌ ఫోన్లు చెవిమీద పెడతాం. హెడ్‌ఫోన్లు పెట్టుకుంటే.. శబ్దానికి, కర్ణభేరి మధ్య గ్యాప్‌ ఉంటుంది. తద్వారా చెవిపై అంతగా ప్రభావం చూపవు. అందుకే బ్లూటూత్‌ ఇయర్‌ ఫోన్స్‌ కంటే హెడ్‌ఫోన్లు వాడటం మంచిది. అది కూడా పరిమితంగానే.

Next Story