వర్షాకాలం .. ఇంటికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇల్లంతా చెమ్మ చెమ్మగా మారుతుంది. దీని వల్ల అన్ని రకాల దోమలు, బొద్దింకలు, జలగల వంటి పలు కీటకాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి.

By అంజి  Published on  14 Aug 2024 1:45 PM IST
home precautions, monsoons, Lifestyle

వర్షకాలం.. ఇంటికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇల్లంతా చెమ్మ చెమ్మగా మారుతుంది. దీని వల్ల అన్ని రకాల దోమలు, బొద్దింకలు, జలగల వంటి పలు కీటకాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో గోడలు, పైకప్పు వెంట మనకు కనిపించని చిన్న చిన్న పగుళ్లు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో వర్షపు నీరు లోపలకు రాకుండా చూసేందుకు ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమో పరిశీలించండి. తర్వాత లీకేజీ నిరోధక మెటీరియల్‌ ఉపయోగించి పగుళ్లను పూడ్చండి. అలాగే ఈ కాలంలో ఎక్కువగా పాడయ్యేవాటిలో పుస్తకాలు కూడా ఉంటాయి.

పుస్తకాలను అల్మారాలు, కప్‌ బోర్డులో ఉంచి తేమ చొరబడకుండా మూసివేయాలి. భారీ వర్షాల కారణంగా చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల డ్రైనేజీలు తరచూ బ్లాక్‌ అవుతాయి. దీంతో కీటకాలు పెరుగుతాయి. అందుకే నిత్యం డ్రైనేజీలను చెక్‌ చేసుకోవాలి. కుండపోత వర్షాల వల్ల ముందుగా ప్రభావితమయ్యేది పైకప్పులే. పగుళ్లున్నా, లీకేజీలు అయ్యే అవకాశం ఉన్నా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. అత్యంత తేమగా ఉండే ప్రదేశాల్లో ఫంగస్‌ పెరుగుతుంది. వెంటనే వాటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.

Next Story