కడుపులో నులిపురుగులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కలుషిత ఆహారం, నీరుతో పాటు ఇతర కారణాల వల్ల కొందరి పేగుల్లో పురుగులు చేరడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది.

By అంజి  Published on  24 Jan 2025 1:45 PM IST
precautions, worms, stomach, Lifestyle, Health

కడుపులో నులిపురుగులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కలుషిత ఆహారం, నీరుతో పాటు ఇతర కారణాల వల్ల కొందరి పేగుల్లో పురుగులు చేరడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. దీనినే నులిపురుగుల (థ్రెడ్‌ వార్మ్‌) ఇన్‌ఫెక్షణ్‌ అంటారు. దీని వల్ల పొత్తి కడుపులో నొప్పి, మలద్వారం వద్ద దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. విసర్జించే మలంలో ఈ చిన్న పురుగులు కనిపిస్తాయి. ఈ పురులు పొట్టలో చేరితే పొత్తి కడుపు నొప్పి, వికారం, వాంతులు అవుతాయి. డయేరియా లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, బలహీనంగా మారి అలసటకు గురవుతారు.

ఆరోగ్య సమస్యలు

ఇవి పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడటంతో పాటు అవయవాలకు నష్టం కలిగిస్తాయి. ఈ క్రిముల కారణంగా పిల్లల్లో, పెద్దల్లో అనేక రకాల వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చికిత్స

పొట్టలో క్రిములకు తొలగించడానికి ప్రత్యేకంగా మందులు ఇస్తారు. ఈ సమస్యను గుర్తించిన వెంటనే డాక్టరు సలహా మేరకు మందులు వాడాలి. వీటి వల్ల శరీరం లోపల నుంచి వ్యాధి కారక పరాన్న జీవి బయటకు పోతుంది.

నులి పురుగుల సమస్య రాకుండా ఉండాలంటే..

చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్లు కత్తిరించుకోవాలి. తినడానికి ముందు, టాయ్‌లెట్‌కు వెళ్లిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు కూడా ఈ పద్ధతి అలవాటు చేయాలి. ప్రతి రోజూ స్నానం చేయాలి. పళ్లు తోమడానికి ముందు, తర్వాత బ్రష్‌లను శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో టవళ్లను, బెడ్‌ షీట్లను వేడి నీళ్లతో ఉతకాలి. పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలను శుభ్రంగా ఉంచాలి. వంటగది, బాత్రూంలను ఎప్పుడూ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన నీరు తాగకూడదు. బాగా కడిగిన తర్వాతే కూరగాయలు, పండ్లు తినాలి. ఇంట్లో కుక్క, పిల్లిని పెంచుతుంటే వాటి వ్యర్థాల జోలికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వాటి వ్యర్థాలను ఎప్పటికప్పుడూ తీసి పడేయాలి.

Next Story