చలికాలం వస్తోంది.. ఆస్తమాతో జాగ్రత్త

చిన్నపిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధుల్లో ఆస్తమా (ఉబ్బసం) ఒకటి. దీని వల్ల ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడి వాయు మార్గాలు కుచించుకుపోయి శ్వాసకు అడ్డంకులు ఏర్పడి సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతారు.

By అంజి  Published on  10 Nov 2024 6:30 AM GMT
precautions, asthma, winter, Health Tips

చలికాలం వస్తోంది.. ఆస్తమాతో జాగ్రత్త

చిన్నపిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధుల్లో ఆస్తమా (ఉబ్బసం) ఒకటి. దీని వల్ల ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడి వాయు మార్గాలు కుచించుకుపోయి శ్వాసకు అడ్డంకులు ఏర్పడి సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతారు. ఆస్తమా బాధితులు ఆయాసం, దగ్గుతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. వానాకాలం, శీతాకాలంలో వాతావరణ పరిస్థితుల మూలంగా ఆస్తమా బాధితులు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. చిన్నారుల్లో పుట్టినప్పుటి నుంచి ఆస్తమా ఉంటే దాన్ని చైల్డ్‌హుడ్‌ ఆన్సెట్‌ ఆస్తమా అని, 20 ఏళ్లు దాటాకా ఆస్తమా వస్తే దానిని అడల్ట్‌ ఆన్సెట్‌ ఆస్తమా అంటారు.

ఆస్తమా లక్షణాలు

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయాసం వస్తుంటుంది.

ఛాతీ బిగుసుకుపోయినట్టు ఉండటం, శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీలో విజిల్‌ సౌండ్‌ లేదా గరగరమనే సౌండ్‌ వినిపిస్తుంది. విపరీతమైన దగ్గు, ఉదయం, రాత్రి వేళల్లో దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అలసిపోయినట్టు, బలహీనంగా కనిపిస్తారు. అలాగే నిద్రలేమి సమస్య వేధిస్తుంది.. గురక తీవ్రత ఎక్కువగా ఉండటం, గొందులో ఈల వేసినట్టుగా శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

పాలకూర, రెడ్‌ క్యాప్సికం, ఉల్లి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అలాగే కమల, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్‌ సి ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాపిల్‌లో ఉండే ఫైటోకెమికల్స్‌, యాపిల్‌ తొక్కలో ఉండే లైకోఫిన్‌ వంటివి ఆస్తమాతో ఇబ్బంది పడే వారిలో ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరిస్తే పొగమంచు, అలర్జీ నుంచి రక్షణ లభిస్తుంది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. వైద్యుల సూచన మేరకు ఇన్‌హెలేషన్‌ థెరపీని అనుసరించడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story