బిర్యానీ అతిగా తింటే..

మాంసాహారం తినేవారిలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేది బిర్యానీ.

By అంజి  Published on  25 Jan 2025 1:31 PM IST
health problems, eating, biryani

బిర్యానీ అతిగా తింటే..

మాంసాహారం తినేవారిలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేది బిర్యానీ. కొందరు వారంలో ఒకసారైనా, మరికొందరు వారంలో 4, 5 సార్లు అయినా చికెన్‌ / మటన్‌ బిర్యానీ తింటుంటారు. దీని రుచి వారిని అంతలా ఆకర్షిస్తుంది. అయితే బిర్యానీని అతిగా తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి కారణం కొన్ని హోటళ్లలో బిర్యానీ తయారీకి ఉపయోగించే నాణ్యత లేని నూనెలు, రంగులు, అతిగా వాడే మసాలాలు, చికెన్. ఇప్పటికే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడుల్లో చాలా హోటళ్లలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఇంట్లో వంట కోసం వాడే నూనె కన్నా అధికంగా హోటళ్లలో బిర్యానీ తయారీకి వాడతారు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడానికి కారణం అవుతుంది. అలాగే బిర్యానీలో చికెన్‌, మటన్‌ ముక్కలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. కొన్ని హోటళ్లలో బిర్యానీ తయారీకి నాణ్యత లేని నూనెలను వాడుతున్నారు. వీటి వల్ల గుండె ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది. బిర్యానీ తయారీలో మసాలాలు అధికంగా వాడతారు. ఇది ఇంట్లో వాడేదానికంటే 2, 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే దానికి అంత రుచి వస్తుంది. దీన్ని అతిగా తింటే ఈ మసాలాల వల్ల అల్సర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story