టూత్‌ బ్రష్‌ వాడకంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

దంత సంరక్షణ కోసం ప్రతి రోజూ బ్రష్‌ చేయాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా చేస్తే ఇంకా మంచిది.

By అంజి  Published on  9 Jan 2025 12:30 PM IST
precautions,toothbrush, Life Style, Health

టూత్‌ బ్రష్‌ వాడకంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

దంత సంరక్షణ కోసం ప్రతి రోజూ బ్రష్‌ చేయాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా చేస్తే ఇంకా మంచిది. అయితే కొంత మంది టూత్‌ బ్రష్‌ సగం అరిగిపోయి, ఊడిపోయినా అదే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. అరిగిపోయిన టూత్‌ బ్రష్‌ను నిర్ణీత వ్యవధిలో మార్చడం ముఖ్యం. అరిగిపోయిన టూత్‌ బ్రష్‌తో పళ్లు తోముకోవడం వల్ల నోటిలో పాచి, బ్యాక్టీరియా తొలగదు. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం.. ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి టూత్‌ బ్రష్‌ను మార్చాలి.

బ్రష్‌ను అంత కంటే ఎక్కువ రోజులు ఉపయోగిస్తే చిగుళ్లు దెబ్బతినే అవకాశం ఉంటంఉది. దానితో రోజూ బ్రష్‌ చేసినా పళ్లు సరిగ్గా క్లీన్‌ అవ్వవు. దీని కారణంగా దంత క్షయం, చిగుళ్ల సమస్యలు ఎదురవుతాయి. ప్లూ, వైరల్‌ ఇన్ఫెక్సణ్‌ వంటి అనారోగ్యం తర్వాత బ్రష్‌ను మార్చాలి. దీని వల్ల సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. అలాగే నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రూట్‌ కెనాల్‌ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స తర్వాత.. బ్రష్‌ను కచ్చితంగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story