మామిడి ఆకులతో ఇన్ని లాభాలా?

వేసవి సీజన్‌ వచ్చిందంటే అందరికి మామిడి పండ్లు గుర్తుకు వస్తాయి. పండ్లు మాత్రమే వీటి ఆకులకు కూడా మంచి

By అంజి  Published on  22 March 2023 5:30 PM IST
KTR , Telangana ,CM KCR

మామిడి ఆకులతో ఇన్ని లాభాలా? 

వేసవి సీజన్‌ వచ్చిందంటే అందరికి మామిడి పండ్లు గుర్తుకు వస్తాయి. పండ్లు మాత్రమే వీటి ఆకులకు కూడా మంచి ఆధరణ ఉంటుంది.శుభకార్యాలకు, ఇంటి గుమ్మానికి కూడా వీటిని కడతారు. అయితే ఈ ఆకులు కేవలం తోరణంగానే కాదు..ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు తెచ్చిపెడతాయి.

పుష్కలమైన విటమిన్లు- ఇందులో విటమిన్ ఏ,బీ,సీ పుష్కలంగా ఉంటాయి.వాటితోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.ఇది మన శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

మధుమేహాం- మధుమేహానికి మామిడి ఆకులు బాగా పని చేస్తాయి. దీన్ని ఆయుర్వేద చికిత్సలోనూ వాడుతూ ఉంటారు. ఆకుల్లో ఉండే ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి.మామిడి ఆకులను ఎండబెట్టి పొడిని చేసి దాన్ని నీటిలో వేసి మరిగించి ఉదయాన్నే వడపోసి ఖాళీ కడుపుతో తాగితే ప్రయోజనం ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు- మూత్రపిండాల్లోని రాళ్ల నివారణకు మామిడి ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మామిడి ఆకుల పొడిని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగితే మూత్రం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లను బయటకు వెళ్లిపోతాయి.

బీపీ కంట్రోల్- బీపీ నియంత్రించడంలో బాగా పని చేస్తుంది. మామిడి ఆకుల పొడిని నీటిలో వేసి ఆకులను కషాయంగా సేవించాలి. పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టును డ్యామేజ్ నుంచి కాపాడతాయి.

Next Story