స్మశానంలో ఆలయం.. రోజూ వందల మంది దర్శనం.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా కొత్తగా పెళ్లయిన ఏ జంట అయినా.. పుణ్యక్షేత్రంలో దేవుడి దర్శనం చేసుకోవాలనుకుంటారు. లేకపోతే ఆ గుడిలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

By అంజి  Published on  23 Jun 2024 11:30 AM GMT
shyama mai temple, darbhanga, bihar

స్మశానంలో ఆలయం.. రోజూ వందల మంది దర్శనం.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా కొత్తగా పెళ్లయిన ఏ జంట అయినా.. పుణ్యక్షేత్రంలో దేవుడి దర్శనం చేసుకోవాలనుకుంటారు. లేకపోతే ఆ గుడిలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ, బీహార్‌లో ఉన్న ఓ ప్రాంతంలో ఉండే ప్రజలు మాత్రం పెళ్లయిన వెంటనే స్మశానంలో ఉండే ఓ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. మరికొందరైతే ఏకంగా ఆ స్మశానంలోనే పెళ్లి కూడా చేసుకుంటారట. వింతగా ఉంది కదూ!.. దీని మరిన్ని వివరాలు కింద ఉన్నాయి..

బిహార్‌లోని దర్భాంగలో ఉన్న ఈ శ్యామ మాయదేవి అమ్మవారి ఆలయాన్ని 1933లో నిర్మించారు. అది కూడా రాజ కుటుంబానికి చెందిన స్మశాన వాటికలో నిర్మించారు. ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో దర్శనం ఇస్తారు. శ్యామ మాయాదేవి అమ్మవారిలో మెడలో ఉండే పుర్రెల మాల హిందీ వర్ణమాల అక్షరాలతో కనిపిస్తుంది. హిందీ వర్ణమాల సృష్టికి ప్రతీక కావడమే ఇందుకు కారణమని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ఉండే కాళీమాతను ఇప్పటికీ తాంత్రిక పూజలతో పూజించడం మరో వింత. అంతే కాదు.. ఈ ఆలయాన్ని ఇప్పటికీ రోజూ వందల మంది దర్శించుకుంటూ ఉంటారు.

అమ్మవారి విగ్రహాన్ని ప్యారిస్ నుంచి తీసుకొచ్చారట. ఈ విగ్రహం పారిస్ నుంచి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. తల్లి శ్యామా కాళీ పాదాలను దర్శించుకోవడం వల్ల భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఆలయ సముదాయం అంతా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. జై శ్యామ మాయి జయఘోష్‌తో వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆలయంలో జరిగే హారతికి విశిష్టత ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయ హారతి కోసం గంటల తరబడి వేచి ఉంటారు.

Next Story