గర్భిణులు ఈ ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలి.. లేదంటే?

గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్‌ సంబందిత మార్పులకు లోనవుతుంది. దీని వల్ల యోనిలో చెమటుల, స్రావాలు అధికం

By అంజి  Published on  30 April 2023 6:00 AM GMT
Pregnant women, health principles, health news, Lifestyle

గర్భిణులు ఈ ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలి.. లేదంటే?

గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్‌ సంబందిత మార్పులకు లోనవుతుంది. దీని వల్ల యోనిలో చెమటుల, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

- తరచూ చేతులు కడుక్కోవటం.. ముఖ్యంగా మలమూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ సబ్బుతో చేతులు కడుక్కోవటం తప్పనిసరి

- రసాయనాలతో తయారు చేసిన లోషన్లతో యోనిని శుభ్రం చేసుకోవద్దు. జననాంగం నుంచి వచ్చే దుర్వాసననూ నిర్లక్ష్యం చేయకండి.

- గర్భణుల యోనిలో స్రావాల ఊట ఆధికంగా ఉండటం వల్ల అక్కడ హానికారక బ్యాక్టీరియా చేరి, ప్రసవం వేళ ఇబ్బందులు రావచ్చు. కనుక వీలున్న మేర తేమను పీల్చుకునే కాటన్‌ లోదుస్తులే వేసుకోవాలి.

- కొందరిలో స్థనాల నుంచి ద్రవాలు విడుదల అవుతాయి. ఆ అసౌకర్యాన్ని అధిగమించడానికి ప్యాడ్స్ వాడాలి తప్ప మర్ధన చేసుకోకూడదు. దీనివల్ల క్షీర గ్రంథులు మరింత చైతన్యవంతమై మరింతగా ద్రవాలు విడుదలవుతాయి.

- వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాయగూరలను నీటిలో కడిగే వాడాలి. వంటింట్లో చెత్త పోగు కాకుండా చూసుకోండి.

- కాలుష్యం లేని వాతావరణంలో నివసించటం, ఇంట్లో ఎవరూ స్మోక్‌ చేయకుండా చూసుకోవడం, హెయిర్‌డై, ఫ్లోర్‌ క్లీనర్స్‌ వాసనలకు దూరంగా ఉండటం మంచిది.

Next Story