'షూ' కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

షూ కొనడానికి వెళ్లినప్పుడు రకరకాల వెరైటీలు చూసి అంతా బాగుందని ఏదో ఒకటి సెలక్ట్ చేసుకుంటాం.

By అంజి  Published on  29 March 2023 3:14 PM IST
Lifestyle, shoes

'షూ' కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

షూ కొనడానికి వెళ్లినప్పుడు రకరకాల వెరైటీలు చూసి అంతా బాగుందని ఏదో ఒకటి సెలక్ట్ చేసుకుంటాం. కానీ మనకు తెలియకుండా చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే షూ కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

సైజు చూసుకోవాలి

షాప్‌కి వెళ్లి షూ కొనేముందు ఒకసారి మీ రెండు కాళ్లను కొలవమని చెప్పాలి. అలా చేస్తేనే మీకు తగిన షూలను సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సైజు సరిపోక పాదాలపై ఒత్తిడి పడుతుంది. కొన్నిసార్లు జారిపోవడం లాంటి ఇబ్బందులు కూడా వస్తాయి.

నంబర్‌‌తో పనిలేదు

కొన్నిసార్లు షూ సైజులు మారుతూ ఉంటాయి. అప్పుడు మనం మన నంబర్ ఇది కాదు కదా అని అనుకోవాల్సిన పనిలేదు. షూ బ్రాండ్లను బట్టి సైజు కూడా మారే చాన్స్ ఉంటుంది. అందుకే మీ కాలికి సరిగ్గా ఫిట్ అయ్యిందా? లేదా? అని చూసుకుంటే సరిపోతుంది. కంఫర్ట్‌గా అనిపిస్తే ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు.

టైట్‌గా ఉండటం

షూ వేసుకున్నప్పుడు మీకు అసలు నొప్పి కలగకూడదు. అందుకే ఒకసారి సాక్స్ లేకుండా మరోసారి సాక్స్ వేసుకొని ధరించి చూడాలి. కంఫర్ట్‌గా ఉన్నాయని అనిపిస్తేనే తీసుకోవాలి. దీన్ని దృష్టి‌లో పెట్టుకుంటే షూ వేసుకునే సమయంలో ఏ ఇబ్బంది ఉండదు.

ఆన్‌లైన్‌లో వద్దు

ఆన్‌లైన్‌లో షూ కొంటే చాలా సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు కాలికి సరిగా ఫిక్స్ అవ్వవు. సైట్‌లో చూడటానికి బాగానే అనిపించినా నేరుగా చూసే సరికి అంత అందంగా ఉండవు. అందుకే నేరుగా షాప్‌కు వెళ్లి కొనాలి. తప్పనిసరి పరిస్థితి అయితే ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

వేగంగా షాపింగ్

సమయం సరిపోవడం లేదని కానీ, ఎంచుకోవడం తెలియక కానీ కిందరు వేగంగా షాపింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ షూ కంఫర్ట్‌గా ఉందా? లేదా? అని చూసుకోరు. అందుకే ఎప్పుడూ కంగారు పడకుండా సమయం కేటాయించాలి. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఒకే జతతో తిప్పలు

ప్రతి రోజూ ఒకే షూ వేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. అందుకే రోజు విడిచి రోజు షూలను వేసుకోవాలి. ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల షూలో ఉండే చెమట డ్రైగా అవుతుంది. దాని వల్ల దురద, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. దుర్వాసన సమస్య కూడా తీరిపోతుంది.

Next Story