నాతో సమానంగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు

Pampers it Takes 2 Campaign. బుల్లితెర‌ జంట రోహిత్‌ రెడ్డి, అనితా హస్సానందానీలు ఎప్పుడూ కూడా తమ

By Medi Samrat  Published on  21 Jun 2022 8:45 AM GMT
నాతో సమానంగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు

బుల్లితెర‌ జంట రోహిత్‌ రెడ్డి, అనితా హస్సానందానీలు ఎప్పుడూ కూడా తమ కుమారుడు అరవ్‌ కు సమానమైన తల్లిదండ్రులుగా సరైన ఉదాహరణగా నిలుస్తుంటారు. ఈ జంట పాంపర్స్‌.. ఇట్‌ టేక్స్‌ 2 క్యాంపెయిన్‌కు మద్దతునందిస్తూ సోషల్‌మీడియా వేదికగా పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు సమానమైన బాధ్యతలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను తెలుపుతూనే చైల్డ్‌కేర్‌ బాధ్యతలను గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

డైపర్‌ బ్రాండ్‌ పాంపర్స్‌.. నూత‌న చిత్రం ద్వారా తల్లిదండ్రుల విధులలో ప్రస్తుతమున్న అసమానతలను గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికి కూడా, బుజ్జాయి ఆలనాపాలనా తల్లి బాధ్యతగానే భావిస్తుండటం జరుగుతుంది. శిశువు పుట్టినప్పటి నుంచి ఆమె ప్రధానమైన సంరక్షకురాలిగా నిలుస్తుంది. కానీ ఈ తరతరాల పాత మూసధోరణులు కారణంగా తరచుగా తండ్రులు తమ పిల్లల జీవితంలో అతి ముఖ్యమైన మైలురాళ్లలో భాగమయ్యే అవకాశం కోల్పోయి తరువాత బాధపడుతుంటారు. ఈ నూతన పాంపర్స్‌ చిత్రాన్ని ఈ భావోద్వేగాలతో తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే ఓ స్వతంత్య్ర సంస్ధ చేత నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్రమాదకరంగా 92% మంది తండ్రులు తమ పిల్లలతో అతి తక్కువ సమయం మాత్రమే గడుపుతున్నామని బాధపడుతుండడం గుర్తించారు.

ఈ చిత్రంలో పిల్లల యోగక్షేమాలను చూసుకోవడం తల్లుల బాధ్యత అనే సంప్రదాయ భావనను తప్పు అని చెబుతూనే, తండ్రులను సైతం భాగం కావాల్సిందిగా చెప్ప‌డం జ‌రిగింది. తమ పిల్లల పెంపకం దగ్గరకు వచ్చేసరికి క్షమాపణకు అవకాశం లేదనే భావనను తండ్రులు పొందాల్సి ఉందని కూడా వెల్లడిస్తుంది. ఈ చిత్రపు ట్యాగ్‌లైన్‌ బాప్‌ బన్నా పడ్తా హై (తప్పనిసరిగా తండ్రి లా ఉండాలి) ద్వారా చిన్నారుల పెంపకంలో తండ్రులు కూడా పాలుపంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలుపుతుంది. అంతేకాదు, చిన్నారులకు తల్లితో పాటుగా తండ్రి ఆలనాపాలనా కూడా ముఖ్యమని వెల్లడిస్తుంది.

ఈ ప్రచారంతో ఏకీభవించడంతో పాటుగా పేరెంటింగ్‌ ప్రమాణాలను గురించి రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ ''చాలా సందర్భాలు అంటే పిల్లలకు డైపర్‌ మార్చడం, వారికి ఆహారం అందించడం, వారిని నిద్ర పుచ్చడం లాంటి పనులు తమకు రావని, మహిళలకు అవి సహజసిద్ధంగానే అబ్బుతాయని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. మహిళలు సైతం నేర్చుకుంటుంటారు (మరీ ముఖ్యంగా తొలిసారి తల్లిగా మారిన వారు). కాకపోతే మగవారిలా వారేమీ హద్దులు గీసుకోరు. నేను ఈ పేరెంటింగ్‌లో భాగం కావడంతో పాటుగా మా అబ్బాయి ఎదుగుదలలో ప్రతి క్షణమూ భాగం కావడం తో పాటుగా అనితతో పాటుగా సమానంగా వాడిని చూసుకుంటున్నాను. ఆరవ్‌ ఎదిగే వయసులో ప్రతి క్షణమూ నేను కూడా ఓ భాగం కావడంతో పాటుగా వాడు చేరుకునే మైలురాళ్లు ఏవీ మిస్‌ కాకూడదని కోరుకుంటున్నాను. అందుకే ఆమె దగ్గర నేర్చుకుంటున్నాను.

శిశువు బాల్యం అత్యంత విలువైనది. తల్లిదండ్రులుగా బాధ్యతలను పంచుకుంటే ఆ బంధం మరింత బలోపేతం కావడంతో పాటుగా చిన్నారితో తల్లిదండ్రులు అనుబంధం కూడా మరింత పెరుగుతుంది. అంతేకాకుండా తల్లి కొంత సేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ప్రసవం తరువాత తల్లికి విశ్రాంతి అత్యంత కీలకం. నేను తండ్రులందరూ పిల్లల ఎదుగుదలలో భాగం కావడంతో పాటుగా తల్లితో సమానంగా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు కృషిచేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఓ బహుమతిగా నిలుస్తుంది. అంతేకాదు, మీ పిల్లలతో పాటుగా మీ భాగస్వామితో ఏర్పరుచుకునే బంధం వెలకట్టలేనిదిగా మారుతుంది'' అని అన్నారు.

అనితా హస్సానందానీ మాట్లాడుతూ ''తొలి రోజు నుంచే నాతో సమానంగా మా అబ్బాయి బాధ్యతలలో పాలుపంచుకుంటున్నాడు. (నిజం చెప్పాలంటే నాకెప్పుడైతే ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిందో అప్పటి నుంచి అతను తండ్రిగా తన బాధ్యతలు నెరవేర్చడం ప్రారంభించాడు). అతని కారణంగానే నేను నా వర్క్‌ కమిట్‌మెంట్స్‌ను ఆరవ్‌ పుట్టిన తరువాత వేగంగా నెరవేర్చగలుగుతున్నాను. ఆరవ్‌ ఈ ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నప్పుడు నేను తీవ్రంగా ఆందోళనపడితే ,అతను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఓ జంటగా, మేము పూర్తి స్పృహతో బాధ్యతలను ఇద్దరమూ పంచుకోవాలని, తల్లిదండ్రులుగా ఆనందం పొందాలనుకున్నాము. పాంపర్స్‌ రూపొందించిన బాప్‌ బనానా పడ్తాహై ఇప్పుడు నూతన తరపు తండ్రులపై దృష్టి సారించడంతో పాటుగా కేవలం తల్లి మీదనే మొత్తం భారం పడేయవద్దని కోరుతుంది. మనం తల్లి, తండ్రిగా మారక మునుపు మనం తల్లిదండ్రులుగా మారతాము. అదీ మనం కోరుకుని, అందువల్ల, పురుషులు తమ బిడ్డ ఎదుగుదలలో పూర్తిగా పాలు పంచుకోవడంతో పాటుగా తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నెరవేర్చాలి'' అని అన్నారు.






















Next Story