ఇప్పటికీ మేము ఒకే కుటుంబం : హార్దిక్ పాండ్యా మాజీ భార్య
నటి నటాసా స్టాంకోవిచ్, భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేర్లు గతంలో చాలాసార్లు వార్తల్లో ఉన్నాయి.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 2:08 PM ISTనటి నటాసా స్టాంకోవిచ్, భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేర్లు గతంలో చాలాసార్లు వార్తల్లో ఉన్నాయి. దాదాపు 5 నెలల క్రితం ఈ జంట విడాకుల ద్వారా వారి 4 సంవత్సరాల వివాహ బంధాన్ని ముగించారు. దీని తరువాత నటాషా తన కుమారుడు అగస్త్యతో కలిసి సెర్బియాకు వెళ్లింది.
అయితే.. ఇప్పుడు ఆమె ఇండియాకు తిరిగి వచ్చి ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. నటాషా తనకు, హార్దిక్‌కు ఉన్న సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడింది. ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేసే స్టేట్‌మెంట్ ఇచ్చింది. నటాషా స్టాంకోవిచ్ చేసిన ఆ ప్రకటన ఏమిటో తెలుసుకుందాం.
సెర్బియా నుండి తిరిగి వచ్చిన తర్వాత నటాషా స్టాంకోవిక్ సంగీత పరిశ్రమలో చురుకుగా మారింది. ఆమె తాజా పాటలు కూడా విడుదలయ్యాయి. ఇటీవల ఆమె E టైమ్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత పరిస్థితి గురించి బహిరంగంగా మాట్లాడింది.
నేను సెర్బియాకు తిరిగి వెళ్తున్నాననే చర్చ ఉంది.. కానీ ఇక్కడ నాకు చిన్న పిల్లవాడు ఉన్నందున అది సాధ్యం కాదు. అగస్త్య పాఠశాల ఇక్కడ ఉంది.. కాబట్టి నేను బాబును విడిచిపెట్టి తిరిగి ఎలా వెళ్ళగలను? అని ప్రశ్నించింది. మేము ఇప్పటికీ ఒక కుటుంబం.. దీనిలో ప్రధాన థ్రెడ్ మా కొడుకు.. నా జీవితంలో నాకు శాంతి అవసరం.. ప్రతి పరిస్థితిలో నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను.. అమ్మ ప్రేమతో పాటు ఇవన్నీ కూడా నా కొడుక్కి నేర్పిస్తానని పేర్కొంది.
ఈ విధంగా నటాషా స్టాంకోవిచ్ హార్దిక్ పాండ్యా, ఆమె కుమారుడు అగస్త్య గురించి మాట్లాడింది. నిస్సందేహంగా ఈ జంట విడాకులు తీసుకున్నట్లు వారి ప్రకటన ద్వారా స్పష్టమైంది. కానీ కొడుకు కోసం ఇద్దరూ ఇప్పటికీ ఒకరినొకరు తమ కుటుంబంగా భావిస్తారు.
2020లో హార్దిక్ పాండ్యా క్రూయిజ్‌లో నటాషా స్టాంకోవిచ్‌కి ఫిల్మీ స్టైల్‌లో ప్రపోజ్ చేసాడు. తరువాత కరోనా మహమ్మారి సమయంలో ఈ జంట వివాహాన్ని కూడా చేసుకున్నారు. కొంతకాలం తర్వాత రాజస్థాన్‌లో మళ్లీ గ్రాండ్ వెడ్డింగ్ ఫంక్షన్‌ను నిర్వహించారు. అయితే ఇంత జరిగినా వీరి దాంపత్యం కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. జూలై 18న హార్దిక్, నటాషా సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.