ఈ ఆలయంలోకి అన్నా చెల్లెల్లకు నో ఎంట్రీ!

సాధారణంగా ఏ గుడికైనా కుటుంబంతో కలిసి వెళ్లి దేవుడిని దర్శించుకోవచ్చు. కానీ, ఓ గుడికి మాత్రం అన్నా చెల్లెల్లు లేదా అక్కా తమ్ముడు కలిసి వెళ్లడం నిషేధం.

By అంజి  Published on  17 March 2024 7:57 AM GMT
narayanpur, shiv-mandir, chhattisgarh

ఈ ఆలయంలోకి అన్నా చెల్లెల్లకు నో ఎంట్రీ!

సాధారణంగా ఏ గుడికైనా కుటుంబంతో కలిసి వెళ్లి దేవుడిని దర్శించుకోవచ్చు. కానీ, ఓ గుడికి మాత్రం అన్నా చెల్లెల్లు లేదా అక్కా తమ్ముడు కలిసి వెళ్లడం నిషేధం. భారత్‌లో ఇలాంటి నిషేధం ఉన్న ఆలయం ఇదొక్కటే. విచిత్రంగా ఉంది కదూ.. ఇంతకీ ఈ గుడి ఎక్కడుంది? ఎందుకు అలాంటి నిషేధం విధించారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇసుకరాయితో నిర్మాణం

అన్నాచెల్లల్లు, అక్కా తమ్ముడు కలిసి వెళ్లడంపై నిషేధం ఉన్న ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ గ్రామంలో ఉన్న ఓ శివాలయం. ఈ ఆలయాన్ని ఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు ఇసుకరాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలను ఇక్కడ చూడొచ్చు. ఈ దేవాలయంలోనే వివిధ విగ్రహాలున్న ఓ చిన్న మ్యూజియం కూడా ఉండటం విశేషం.

నిషేధానికి కారణం

ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లే నిర్మించారట. గుడిని నిర్మించే శిల్పి నారాయణ్‌ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవారట. దీంతో రోజూ తన భార్య భోజనం తీసుకొచ్చేదట. కానీ, ఓ రోజు నారాయణ్‌ సోదరి భోజనం తీసుకుని ఆలయంలోకి వచ్చింది. దీంతో నారాయణ్ దాన్ని అవమానంగా భావించి గుడిలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రావడాన్ని నిషేధించారు.

Next Story