కొంతమంది మహిళలు పగటి పూట ముఖానికి ఎన్నో రకాల ఫేస్ క్రీమ్‌లు వాడతారు. అయితే చాలా తక్కువ మంది రాత్రుళ్లు నైట్ క్రీమ్‌లు వాడుతారు. వీటితో ముఖ సౌందర్యానికి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం..
పగలు కంటే రాత్రి సమయంలోనే శరీరకణాలు రిపేర్ చేసుకుంటాయి. అప్పుడే కొత్త కణాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఈ సమయంలోనే చర్మంపై ఉండే మృత కణాలు, వ్యర్థాలను శరీర వ్యవస్థ తొలగిస్తుంది. సహజ నైట్ క్రీమ్‌లో విటమిన్ సి, ఈ, ఏ, ఆలివ్ ఆయిల్, తేనె, కలబంద ఉంటాయి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాదు ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. కాబట్టి వీటిని వాడటం వల్ల చర్మానికి మేలు కలుగుతుంది.
మీ చర్మానికి సెట్ అయ్యే నైట్ క్రీంను మాత్రమే ఎంచుకోండి. నైట్ క్రీం ముఖానికి అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొంచెం క్రీం రాయాలి. ఇలా చేయడం వల్ల మీ అందాన్ని పెంచుకోవడంతో పాటు మరింత యవ్వనంగా కనిపిస్తారు.
నోట్: పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించింది. ఇది మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న చర్మ ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.