ఆడ పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత రెండేళ్ల వరకు మాత్రమే హైట్ పెరుగుతారు. కానీ ప్రస్తుతం చిన్న వయసులోనే రజస్వల కావడం వల్ల ఎత్తు పెరగడం కష్టమైపోతోంది. ఇలా కాకుండా ఉండాలంటే వారికి వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు, సరైన బరువు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధిక బరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
అంతకంటే ముందు శారీరకంగానూ, మానసికంగానూ తొలి రెండేళ్ల వయసు చాలా కీలకమని నిపుణులు అంటున్నారు. దాదాపు 90 శాతం మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతంది. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడుకన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుంది. పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే.. పిల్లల ఎదుగుదల అంత బావుంటుందంటున్నారు నిపుణులు.