విజయం మీ వెంటే ఉండాలంటే
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరినే ఆ విజయం వరిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ బాగా...
By - అంజి |
విజయం మీ వెంటే ఉండాలంటే
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరినే ఆ విజయం వరిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ బాగా పనిచేసినప్పుడే విజయాన్ని సులభంగా చేరుకోవచ్చు. ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటూ గతంలో అధిరోహించిన విజయ శిఖరాల అనుభూతులను మనసులో మెదులుతూనే ఉండాలి. ఇలా సాధన చేయడమే విజయపరంపరకు పునాది అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
మనసును శుద్ధి చేయండి
మనసులో పేరుకుపోయిన అనుమానాలు, భయాలు, ఆందోళనలు అనే మలినాలను కడిగేయాలి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు తుడిచివేయడం వల్ల సానుకూల ఆలోచనలు, జీవితంపై ఆశ, ఆనందంగా ఉన్నామనే భరోసా కలుగుతుంది.
పోలిక వద్దు
వ్యక్తిగతంగా లోతుగా అర్థం చేసుకోవడం ఎంతో మంచిది. అప్పుడే మనలోని బలం, బలహీనత, అవసరం, లక్ష్యం బయటపడతాయి. ఇలా తెలుసుకున్న తర్వాత ఎదుటి వాళ్లతో పోల్చుకునే అవసరం ఉండదు. దీంతో మనకు తెలియకుండానే ఉన్నతమైన ఆలోచనలు మొదలవుతాయి.
మెడిటేషన్
మనసును ప్రశాంతంగా ఉంచుతూ పర్సనల్ కాన్ఫిడెన్స్ పెరిగేందుకు మెడిటేషన్ సాధన చేయాలి. రోజూ సాధన చేయడం వల్ల మనపై మనకు విశ్వాసం, ధైర్యం పెరుగుతోంది.
సక్సెస్ పోస్టర్
మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మీ జీవితంలో విజయ సాధించిన విషయాలను పోస్టర్‌లా మీకు కనపడేలా అతికించండి. రన్నింగ్ కాంపిటీషన్ లో గెలుపు, స్కాలర్ షిప్ సాధించడం, ఫెయిల్ అయ్యే సబ్జెక్టులో మంచి మార్కులు సాధించినా లేదా పాసైన విషయాలు, హ్యాపీగా ఫీల్ అయిన విజయాలతో పోస్టర్ లాగా రూపొందించుకోవాలి. ఈ పోస్టర్ చూసిన ప్రతిసారి మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతోంది.
పాజిటివ్ వ్యక్తులతో సావాసం
మంచి ఆలోచన ధోరణి ఉండే వ్యక్తులతో సావాసం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది.
దీంతో వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉన్నామనే భావన కూడా దూరమైతుంది.
స్ల్పిట్ టార్గెట్..
శిఖరాల్లాంటి లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రణాళిక చాలా ముఖ్యం. లక్ష్యాన్ని సులభంగా చేరుకునేందుకు విభజన చేయాలి. దీంతో రోజు వారీ టార్గెట్లను రీచ్ అవుతూ అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
అలవాట్లు మార్చుకోవాలి
ఆరోగ్యకరమైన ఆలోచనలను పెంచుకునేందుకు ధ్యానం, యోగాతోపాటు మంచి ఆహారం, నిద్ర వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. దీంతో మీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే పాజిటివ్‌గా ఉండవచ్చు.