కీర్తి సురేష్ చెప్పేసిందిగా.. ఎంతో మందికి హార్ట్ బ్రేక్

నటి కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.

By Kalasani Durgapraveen  Published on  27 Nov 2024 3:45 PM IST
కీర్తి సురేష్ చెప్పేసిందిగా.. ఎంతో మందికి హార్ట్ బ్రేక్

నటి కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఆమె జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. 15 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట డిసెంబర్ 11- 12 తేదీల్లో గోవాలో వివాహాన్ని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సన్నిహితులు, స్నేహితులు హాజరవ్వనున్నారు. కొన్నాళ్లుగా వీరి ప్రేమ గురించి గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, కీర్తి చివరకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో దానిని ధృవీకరించింది.

ఆమె ఆంటోనీతో కలిసి క్రాకర్స్ కాల్చుతున్న ఫోటోను ట్వీట్ చేసింది. ఫోటోలో, ఈ జంట కెమెరాకు అటుగా నిలబడి ఆకాశం వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. కీర్తి ఎరుపు రంగు డ్రెస్ లో ఉండగా, ఆంటోని క్యాజువల్‌ దుస్తులు ధరించాడు. పెళ్లి తేదీలు, మ్యారేజ్ లొకేషన్లకు సంబంధించిన వార్తలు విస్తృతంగా వైరల్ అవుతున్నప్పటికీ, ఈ జంట ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మహానటి, సర్కారు వారి పాట వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న కీర్తి, చాలా సంవత్సరాలుగా తన వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

Next Story