ఈ సింపుల్‌ టిప్స్‌తో.. మీ స్మార్ట్‌ ఫోన్ మొరాయించకుండా చూసుకోండి.!

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం ఎంతగా పెరిగిందో మనకు తెలుసు. ఉదయం నిద్రలేపే అలారం నుంచి రోజువారీ పనులన్నీ దానితోనే ముడిపడి ఉన్నాయి.

By అంజి  Published on  16 April 2023 2:30 PM IST
smartphone, smartphone hanging,  phone hanging tips, lifestyle

ఈ సింపుల్‌ టిప్స్‌తో.. మీ స్మార్ట్‌ ఫోను మొరాయించకుండా చూసుకోండి.!

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం ఎంతగా పెరిగిందో మనకు తెలుసు. ఉదయం నిద్రలేపే అలారం నుంచి రోజువారీ పనులన్నీ దానితోనే ముడిపడి ఉన్నాయి. అయితే.. దాని పనితీరులో ఏమైనా తేడావస్తే.. ఆ రోజు దినచర్య ఆగిపోయే పరిస్థితి. అయితే.. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీస్మార్ట్‌ఫోన్‌ మొరాయించకుండా చూసుకోవచ్చు.

- ఫోన్‌ టచ్‌స్క్రీన్‌ దెబ్బతినకుండా చూసుకోండి. కొన్నిసార్లు తక్కువ ఎత్తు నుంచి కిందపడినా సరే.. డిస్‌ప్లే పూర్తిగా పోతుంది. కనుక ఫోన్‌ కొనగానే మంచి టెంపర్డ్ గ్లాస్‌ను వేయించండి.

- మొబైల్ కిందపడితే ఫోన్‌ వెనుక భాగం కూడా పాడవుతుంది. అందుకే మంచి మొబైల్ కేస్ (బ్యాక్ పౌచ్)లను ఎంచుకోవాలి.

- రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టొద్దు. దీనివల్ల టైం కలిసొచ్చినా.. బ్యాటరీ అతిగా ఛార్జింగ్ అవటం, దాని జీవితకాలం తగ్గటం, బ్యాటరీ ఉబ్బటం జరుగుతుంది. - ఇప్పుడున్న ఫోన్‌లకు రెండు గంటలు ఛార్జింగ్‌ చాలు

- ఫోన్‌బగ్స్‌ను తొలగించడం, కొత్త ఫీచర్‌లను జోడించడంలో అపరేటింగ్‌ సిస్టమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కనుక ఓఎస్‌ని అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి.

- వెళ్లిన ప్రతిచోటీకి మొబైల్‌ను పట్టుకువెళ్లడం ఇప్పుడు అలవాటుగా మారింది. దీని వల్ల దాని ఛార్జింగ్ పోర్ట్, ఆడియో ఫోర్ట్‌లలో దుమ్ము చేరి, ఛార్జింగ్, ఆడియో క్లారిటీలో మార్పు వస్తుంది. అందుకే తరచూ ఆ పోర్ట్‌లను దెబ్బతినకుండా క్లీన్ చేయాలి.

- మనిషికైనా, యంత్రానికైనా కాస్త విరామం అవసరం. అందుకే ఫోన్‌తో పనిలేనప్పుడు దానిని స్విచ్‌ఆఫ్‌ చేసి విరామం ఇవ్వాలి.

- స్పైవేర్, ర్యాన్స్‌మ్‌వేర్‌, యాడ్‌వేర్‌లు ఫోన్‌లో చొరబడకుండా మంచి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఉండాలి. అలాగే స్ట్రాంగ్ పాస్‌వర్డ్, ఫింగర్‌ప్రింట్‌ లాక్‌ పెట్టుకోవాలి. సున్నితమైన సమాచారాన్ని ఫోన్‌లో పెట్టుకోవద్దు.

- రోజువారీ ఫొటోలు, వీడియోలలో అవసరం లేనివి తొలగించాలి. స్టోరేజీ పెరిగేకొద్దీ.. ఫోన్‌ పనితీరు నెమ్మదిస్తుంది. దీనితో బాటు యాప్‌ స్టోరేజ్, క్యాచెస్‌ను కూడా క్లియర్ చేసి తగినంత స్పేస్‌ ఉండేలా చూసుకోవాలి.

Next Story