నైట్ షిప్ట్‌లో జాబ్ చేసేవారు.. ఇవి పాటించడం ఎంతో మేలు!
ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు సహా చాలా సంస్థల్లో ఉద్యోగులకు నైట్ షిప్ట్ డ్యూటీలు చేయడం తప్పనిసరి.
By అంజి Published on 27 Oct 2024 10:11 AM ISTనైట్ షిప్ట్‌లో జాబ్ చేసేవారు.. ఇవి పాటించడం ఎంతో మేలు!
ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు సహా చాలా సంస్థల్లో ఉద్యోగులకు నైట్ షిప్ట్ డ్యూటీలు చేయడం తప్పనిసరి. అయితే ఇలా రాత్రివేళ ఉద్యోగం ఆయా ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు.. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఉద్యోగులకు మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ అని తేలింది. నైట్ షిప్ట్‌ల వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సంబంధించిన ప్రోటీన్ రిథమ్స్ దెబ్బతింటాయని, జీవక్రియ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది.
'మెదడులోని మాస్టర్ బయోలాజికల్ క్లాక్' పగలు, రాత్రి వేళల్లో శరీర లయలను నియంత్రిస్తుంది. నైట్ షిప్ట్ చేసే వారిలో ఇది క్రమరహితమై దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీస్తుంది.. ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు. నైట్ షిప్ట్స్ వల్ల శరీర జీవక్రియల లయ దెబ్బతింటోందని, ఇది మధుమేహం, ఊబకాయం రిస్క్‌ను పెంచుతుందని, దాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. ఇన్సులిన్ ఉత్పత్తి, బీపీపై కూడా నైట్ షిప్ట్ ప్రభావం ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.
- అదే పనిగా కూర్చోకుండా గంటకు ఒకసారైనా లేచి నడవాలి. పనిలో అలసిపోయినట్టు అనిపిస్తే కుర్చీ నుంచి లేచి కాస్త నీరు తాగి 5 నిమిషాలు నడిచి మళ్లీ వర్క్ చేసుకోవడం మంచిది.
- రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్లు నీరు తాగాలి. పండ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు, సలాడ్‌లాను ఎక్కువగా తీసుకోవాలి.
- రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
- ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి పడుకోండి. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయవద్దు.
- నైట్ షిప్ట్ అని కాఫీ, టీలను ఎక్కువగా తాగొద్దు. ఇది జీవక్రియ మీద ప్రభావం చూపిస్తుంది.
నైట్ షిప్ట్ చేస్తున్నా రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం మంచిది.
- ఆహారంలో ఎక్కువగా గుడ్లు, పాలు, పప్పులు ఉండేలా చూసుకోండి. ఎక్కువ మసాలాలు, కారం, మాంసాహారం తీసుకుంటే.. అవి పగలు మీ నిద్రను ప్రభావితం చేసే అవకాశం ఉంది.