బేకింగ్‌ సోడా.. బేకింగ్‌ పౌడర్‌కు మధ్య తేడా ఇదే?

బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌ చూడటానికి ఒకేలా ఉంటయి. అలాగే వాటి పేర్లు కూడా కొంచెం దగ్గరగా ఉండటంతో చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతుంటారు.

By అంజి
Published on : 5 May 2025 1:30 PM IST

baking soda, baking powder, Life style

బేకింగ్‌ సోడా.. బేకింగ్‌ పౌడర్‌కు మధ్య తేడా ఇదే?

బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌ చూడటానికి ఒకేలా ఉంటయి. అలాగే వాటి పేర్లు కూడా కొంచెం దగ్గరగా ఉండటంతో చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం..

బేకింగ్‌ సోడా

బేకింగ్‌ సోడాను సోడియం బైకార్బోనేట్‌ అని అంటారు. అలాగే సోడా, తినే సోడా, వంట సోడా అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సోడియం బైకార్పొనేట్‌ అనేది ఆల్కలీన్‌ ఉప్పు. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువును విడుదల చేయడానికి ఆమ్లాలతో చర్య జరుపుతుంది. కేకుల్లాంటివి స్పాంజీలా ఉండటానికి బేకింగ్‌ సోడా ఉపయోగపడుతుంది. దీన్ని చల్లని ప్రదేశంలో ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

బేకింగ్‌ పౌడర్‌

ఇది ఒక రకమైన యాసిడ్. మొక్కజొన్న పిండి, బేకింగ్‌ సోడా కలయిక వలన వచ్చే మిశ్రమం. నిజానికి బేకింగ్‌ పౌడర్‌ కంటే బేకింగ్‌ సోడానే నాలుగు రెట్లు శక్తివంతమైనది. మీరు 1 టీ స్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌ ఉపయోగిస్తే.. పావు టీ స్పూ్‌ మాత్రమే బేకింగ్‌ సోడాను ఉపయోగించాలి.. బేకింగ్ పౌడర్‌ తేమను తాకిన వెంటనే రియాక్షన్‌ చూపిస్తుంది. బేకింగ్‌ పౌడర్‌ 3 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మాత్రమే నిల్వ ఉంటుంది.

Next Story