నేలపై పడుకుంటే మంచిదేనా?

మెత్తటి పరుపు పరిచిన మంచంపై పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. కానీ నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయని, ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని చాలా మంది భావిస్తారు.

By అంజి  Published on  12 July 2024 12:00 PM GMT
sleeping, Sleep on the floor, health, Lifestyle

నేలపై పడుకుంటే మంచిదేనా?

మెత్తటి పరుపు పరిచిన మంచంపై పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. కానీ నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయని, ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని చాలా మంది భావిస్తారు. అందుకే నేలపై పడుకుంటే వెన్నునొప్పి తగ్గుతుందని నమ్మేవారు చాలా మందే ఉన్నారు.

కానీ, ఇది వాస్తవం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ అలా నేలపై పడుకోవడం వల్ల మీరు ఇతర సమస్యలకు వెల్‌కమ్‌ చెప్పినట్టే అవుతుందట. నేలపై పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక దాని సహజ వక్రతను నిర్వహించడానికి తగినంత మద్ధతు ఉండదు. దీని వల్ల కాలక్రమేణా వెన్నెముక దృఢత్వం తగ్గుతుంది. అలాగే వెన్నెముక దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

నేలపై పడుకోవడం వల్ల వచ్చే మరొక సమస్య.. తుంటి, భుజం వంటి కొన్ని ప్రాంతాలు మీ శరీర బరువు భారాన్ని భరించలేకపోతుంటాయి. దీని వల్ల శారీరక అసౌకర్యం, రక్తప్రసరణ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు లేదా నిద్ర మత్తులో ప్రమాదకరమైన వస్తువులను తాకితే గాయాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే నేలపై పడుకొని లేవడానికి కష్టంగా ఉంటుంది.

ముఖ్యంగా ఆర్థరైటిస్‌ సమస్యలు, వెన్నునొప్పి ఉన్నవారు నేలపై పడుకుంటే నొప్పులు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. అందువల్ల నేలపై పడుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Next Story