వీరు పనస పండును తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

వానాకాలంలో లభించే పండ్లలో పనస ఒకటి. దీని నుంచి వచ్చే వాసన, తొనల రుచి మనలో తినాలన్న కోరికను పెంచుతాయి.

By అంజి  Published on  4 Aug 2024 8:45 AM GMT
Panas fruit, health, Lifestyle

వీరు పనస పండును తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

వానాకాలంలో లభించే పండ్లలో పనస ఒకటి. దీని నుంచి వచ్చే వాసన, తొనల రుచి మనలో తినాలన్న కోరికను పెంచుతాయి. పనస తొనల్లో ఫైబర్‌, విటమిన్‌ ఎ, సీ పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌, మాంగనీస్‌, ప్రొటీన్స్‌ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పనసపండు తొనలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కొందరు తరచుగా అలర్జీల బారిన పడుతుంటారు. వీరు పనస పండును తింటే ఈ లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. శ్వాస సమస్యలతో ఇబ్బందిపడేవారు కూడా ఈ ఫలానికి దూరంగా ఉండటం మంచిది.

డయాబెటిస్‌ పేషెంట్లు కూడా పనస పండును తినకపోవడం మంచిది.

పనసపండు తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయట. అందుకే గర్భిణులు తినకూడదు. అలాగే బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా తినకూడదు. ఈ విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

పనస పండులో ఉండే పొటాషియం కిడ్నీ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు పనసపండును తినకూడదు.

పనస తొనలను అతిగా తింటే జీర్ణం కావడం కష్టం. దీని వల్ల కడుపు నొప్పి, ఇతర ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నవారైనా సరే వీటిని మితంగా తినడం మంచిది.

Next Story