ఐస్‌క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఐస్‌క్రీమ్‌ని చాలా ఇష్టంగా తింటారు. డయాబెటిస్ రోగులు, ఇది తింటే లావు అవుతామని భావించేవారు ఐస్‌క్రీమ్ జోలికిపోరు.
By అంజి Published on 1 May 2024 9:30 PM ISTఐస్‌క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఐస్‌క్రీమ్‌ని చాలా ఇష్టంగా తింటారు. డయాబెటిస్ రోగులు, ఇది తింటే లావు అవుతామని భావించేవారు ఐస్‌క్రీమ్ జోలికిపోరు. కొందరు ఐస్‌క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదికాదని చెబుతారు. ఆ ఆరోపణల నేపథ్యంలో ఐస్‌క్రీమ్ మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టరల్ విద్యార్థులు పరిశోధన చేశారు. దీనిలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి హానికరం కాదని.. కొద్ది పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనని పరిశోధకులు తేల్చారు.
ఐస్‌క్రీమ్‌లో కాల్షియం, మెగ్నీషియం, బి12 విటమిన్లు ఉంటాయి. అలాగే దీని తయారీలో ఉపయోగించే పాలు, క్రీమ్‌లలో విటమిన్-ఏ, కోలిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపర్చడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచి మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. ఐస్‌క్రీమ్ ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని లిఫ్ట్ చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బోన్స్‌ను హెల్దీగా మార్చడంలోనూ, స్కిన్ హైడ్రేషన్‌కి, జీర్ణక్రియలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఐస్‌క్రీమ్ తయారీలో పెద్ద మొత్తంలో చక్కెర, ఫ్యాట్, కృత్రిమ స్వీటెనర్‌లు, ఇతర పదార్థాలను వినియోగిస్తారు. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఎక్కువగా ఐస్‌క్రీమ్ తింటే మధుమేహం, ప్రీడయాబెటిస్, పీసీఓఎస్ ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుందని, కొన్నిసార్లు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చాలా చోట్ల ఐస్‌క్రీమ్‌లను కల్తీ చేసి రకరకాల హానికర రంగులు, డెయిరీ పదార్థాలను కలిపి తయారు చేస్తున్నారు. ఇలాంటివి తినడం ఆరోగ్యానికి అత్యంత హానికరం. అందుకే స్వీట్ తక్కువగా ఉన్న బ్రాండెడ్ ఐస్‌క్రీమ్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. రోజూ తినే అలవాటు ఉంటే అరకప్పు మించి ఎక్కువగా తినకూడదు. అతిగా తినడం అనేది ఏ పదార్థం విషయంలోనైనా ముప్పే.. అందుకే రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఐస్‌క్రీమ్ తినడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. అతిగా తింటే మాత్రం హానికరం అని గుర్తుంచుకోండి.