కొందరికి గడ్డం ఒత్తుగా పెంచుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ అలా పెరగదు. దీని కోసం మార్కెట్‌లో దొరికే ఆయిల్స్, క్రీమ్స్ రాస్తుంటారు. అలా రాసినా ప్రయోజనం ఉండదు. అయితే మందమైన గడ్డం పెరగడంలో జన్యువులు కూడా కీ రోల్ పోషిస్తాయట. కుటుంబంలో ముందు ఎవరికైనా మందంగా గడ్డం ఉంటే మనకూ వచ్చే అవకాశాలు ఉంటాయట. కుటుంబంలో ముందు జనరేషన్‌లో ఎవరికీ గడ్డం రాకపోతే మనకూ వచ్చే అవకాశం తక్కువ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అయితే గడ్డం ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. గుడ్లు, బాదం, జీడిపప్పు వంటి పదార్థాలు తినాలి. ఆకు కూరలు, క్యారెట్‌లో ఉండే విటమిన్ -ఏ కూడా గడ్డం గుబురుగా పెరగడంలో సాయం చేస్తుంది. అలాగే నాణ్యమైన బియర్డ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తుంటే అందంగా పెరుగుతుంది. అలాగేవారంలో ఒకసారి షేప్ సరిగా ఉండేలా ట్రిమ్ చేస్తే గడ్డం సమానంగా పెరుగుతుంది. ట్రిమ్ చేసిన తర్వాత బియర్డ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే చర్మం తేమగా ఉండి ఇన్ఫెక్షన్‌లు రావు. ఒత్తిడి వల్ల తల జుట్టుతో పాటు గడ్డం కూడా రాలిపోతుంది. అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలి.