టవల్ ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి.. సర్వేలో ఏం తేలిందంటే?

మన నిత్యం జీవితంలో టవల్‌ ఎంతో అవసరమైనది, ముఖ్యమైనది కూడా. చేతులు శుభ్రం చేసుకున్నాకా, స్నానం చేశాకా.. ఇలా ప్రతిసారి టవల్‌ని ఉపయోగిస్తుంటాం.

By అంజి  Published on  14 Sep 2023 5:30 AM GMT
towel, towel wash, Lifestyle

టవల్ ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి.. సర్వేలో ఏం తేలిందంటే?

మన నిత్యం జీవితంలో టవల్‌ ఎంతో అవసరమైనది, ముఖ్యమైనది కూడా. చేతులు శుభ్రం చేసుకున్నాకా, స్నానం చేశాకా.. ఇలా ప్రతిసారి టవల్‌ని ఉపయోగిస్తుంటాం. కొంతమంది టవల్‌ కొంచెం బ్యాడ్ స్మెల్‌ వచ్చినా వెంటనే ఉతుకుతారు. ఇంకొందరు మరోసారి వాడుకొవచ్చేమో అని ఆలోచిస్తారు. అయితే టవల్‌ని ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? రోజూ ఉతకపోతే జబ్బులు వస్తాయా? తరచూ ఉతక్కపోతే ఏమవుతుంది? ఇలా చాలా ప్రశ్నలు మీ మదిలో మెదిలే ఉంటాయి. అయితే వీటికి సమాధానం చెప్పేందుకు ఇటీవల బ్రిటన్‌లో 2,200 మంది యువతీయులకులతో ఈ అంశంపై సర్వే చేశారు.

ఈ సర్వేలో ఎక్కువ మంది టవల్‌ని క్లీనింగ్‌ చేసుకునే విషయమై తమకు సరైన అవగాహన లేదని చెప్పారు. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది 3 లేదా 4 నెలలకు ఒకసారి టవల్‌ని శుభ్రం చేసుకుంటామని చెప్పారు. అలాగే సర్వేలో పాల్గొన్నవారిలో అయిదుగురిలో ఒకరు తాము నెలకోసారి టవల్ ఉతుకుతామని చెప్పారు. 25 శాతం మంది వారానికి ఒకసారి ఉతుకుతామని చెప్తే, ప్రతి 20 మందిలో ఒకరు మాత్రం వినియోగించిన ప్రతిసారి టవల్‌ను ఉతుకుతామని చెప్పారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. కనీసం వారానికి ఒకసారి అయినా టవల్‌ని ఉతకాలి. ఒక వేళ ఒంటరిగా ఉండేవారైతే 15 రోజులకు ఒక్కసారి తమ టవల్‌ని తప్పనిసరిగా ఉతుక్కోవాలి.

టవల్‌ మనకు చూడటానికి క్లీన్‌గా కనిపిస్తున్నా, రోజులు గడిచేకొద్దీ అందులో లక్షల్లో క్రిములు చేరతాయి. దీని వల్ల అది ఉపయోగించేవారితో పాటు, తోటి వారికి కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టవల్‌ని ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి, లేదంటే సూక్ష్మజీవులు పెరిగిపోయాక, ఒక్కసారి వాటన్నింటీని తొలగించడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు. శరీరంపై ఉండే కొన్ని సూక్ష్మజీవులు మనకు హానికరమైనవి కావు. అయితే అవి చర్మం తెగిన ప్రాంతానికి చేరితే మాత్రం ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది. చర్మ సమస్యలు రావడానికి ఇంట్లో శుభ్రత లోపించడం, టవల్ శుభ్రంగా లేకపోవడం వంటి అంశాలు కూడా కారణం అవుతాయి.

Next Story