టీవీని ఎంత డిస్టెన్స్‌లో చూస్తున్నారు?
ప్రస్తుతం టీవీ అనేది మన జీవితాల్లో ఓ భాగమైపోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన వినోద మాధ్యమాల్లో టీవీ కూడా ఒకటి.
By అంజి Published on 8 Aug 2024 12:00 PM ISTటీవీని ఎంత డిస్టెన్స్‌లో చూస్తున్నారు?
ప్రస్తుతం టీవీ అనేది మన జీవితాల్లో ఓ భాగమైపోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన వినోద మాధ్యమాల్లో టీవీ కూడా ఒకటి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో, టీవీ కూడా స్మార్ట్‌గా మారింది. పరిమాణం, ప్రకాశం, వినోదం వంటి విషయాల్లో టీవీ చాలా రెట్లు స్మార్ట్‌గా మారింది. వీటికి తోడు ఓటీటీల్లోనే ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రసారం అవుతుండటంతో.. టీవీలకు యమ క్రేజ్ ఏర్పడింది. ఎలక్ట్రానిక్ షోరూమ్‌లలో అడుగు పెట్టడం ఆలస్యం.. బోలెడు రకాల టీవీలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ టీవీ చూసేవాళ్లే. ఇంట్లో టీవీ దర్జాగా కనిపించాలని ఉన్న వాటిలో పెద్ద టీవీలనే కొంటున్నారు చాలా మంది. అయితే టీవీ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
టీవీ కొనే ముందు
- ఇంట్లో టీవీని ఏ గదిలో పెట్టాలనుకుంటున్నారో ఆ గది పరిమాణాన్ని బట్టి టీవీని ఎంచుకోవడం చాలా అవసరం.
- టీవీ 24 అంగుళాలు ఉంటే.. దానిని చూడటానికి మీకూ టీవీకి మధ్య కనీసం మూడు అడుగుల దూరం కచ్చితంగా ఉండాలి. 24 - అంగుళాల టీవీని చూడటానికి గరిష్ట దూరం ఐదు అడుగులు ఉండాలి.
- మీ ఇంట్లో 32 అంగుళాల టీవీ గనుక ఉన్నట్టయితే.. దానిని కనీసం 6 అడుగుల దూరం నుండి చూడాలి.
- అదే 50 నుంచి 55 అంగుళాల స్క్రీన్ సైజు టీవీ ఉంటే.. మీకూ టీవీకి మధ్య 10 అడుగుల దూరం కంటే దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు.
- ఇక టీవీ 65 అంగుళాలు ఉన్నట్టయితే.. దాదాపు 13 అడుగుల దూరంలో నుంచే చూడాలి. లేదంటే.. మీ కళ్లు కచ్చితంగా ప్రమాదంలో పడ్డట్టే.