నిద్రలో కొందరు ఉలిక్కిపడి లేస్తారు. ఏమైందని అడిగితే ఏమో గుర్తు లేదు అని జవాబు చెప్తారు. నిద్రలో ఉన్నప్పుడు మనల్ని అంతలా ప్రభావితం చేసే కలలు నిద్రలేచాక ఎందుకు గుర్తుండవు? ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మన జ్ఞాపకాలను మెదడులోని హిప్పోక్యాంపస్ అనే భాగం నిల్వ చేసుకుంటుంది. మనం నిద్రపోయినప్పుడు మెదడు యాక్టీవ్‌గానే ఉన్నప్పటికీ.. ఈ హిప్పోక్యాంపస్ అనే భాగం విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే మనం ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవడానికి నోరాడ్రినలిన్ అనే హార్మోన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ కూడా మనం నిద్రపోయినప్పుడు తక్కువ స్థాయిలో విడుదల అవుతుంది.
అందుకే మనం నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కలలు సరిగ్గా గుర్తుండవు. అలాగే.. మనకొచ్చే కలలు అస్పష్టంగా, అస్థిరంగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగే సంఘటనల కన్నా విభిన్నంగా ఉంటాయి. అందుకే వీటిని గుర్తుంచుకోవడం చాలా కష్టం. కొన్ని కలలు భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను హెచ్చరిస్తాయట. మన ఆందోళన, భయం నిజమైతే ఎలా ఉంటుందో అవే కొన్నిసార్లు కలల రూపంలో వస్తాయట.