వానా కాలంలో వీటిని తినడం ఉత్తమం

మొన్నటి వరకు మండే ఎండలతో సతమతమైన ప్రజలకు వర్షాలు మొదలవడం వల్ల కాస్త ఊరట లభిస్తోంది.

By అంజి  Published on  11 July 2024 3:45 PM IST
monsoon, Lifestyle, Rain season, Food

వానా కాలంలో వీటిని తినడం ఉత్తమం

మొన్నటి వరకు మండే ఎండలతో సతమతమైన ప్రజలకు వర్షాలు మొదలవడం వల్ల కాస్త ఊరట లభిస్తోంది. అయితే వర్షాకాలంలో జబ్బులు కూడా వెంటాడుతాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గడంతో వ్యాధులు పెరుగుతుంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లేదంటే వైరల్‌ ఫీవర్స్‌ బారిన పడాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులకు తరచూ జలుబు, తుమ్ములు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అసలు ఈ వర్షాకాలంలో ఎం తినాలో, ఏం తినకూడదో ఇప్పుడు చూద్దాం..

ఇవి తీసుకుందాం..

వర్షాకాలంలో కూడా శరీరం డీహైడ్రేట్‌ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండవచ్చు. అల్లం, హెర్బల్‌ టీలు, సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే సీజన్‌ ఫ్రూట్స్‌ తప్పకుండా తింటుండాలి. యాపిల్స్‌, దానిమ్మ, నారింజ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి విటమిన్‌ సి ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజూ బాదం తింటే చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి వెల్లుల్లి, ఉల్లిపాయలు రక్షిస్తాయి. వర్షాకాలంలో వృద్ధులపై శ్రద్ధ వహించాలి. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని అందించడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉంటారు. అలాగే బ్రకోలి, బెల్‌ పెప్పర్స్‌, కివీస్‌ కూడా మంచివే.

వీటిని మానేద్దాం..

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. ఈ వర్షాకాలంలో వాటిని పండించే ప్రదేశాలు అపరిశ్రుభంగా మారుతాయి కాబట్టి.. ఆకుకూరలకు దూరంగా ఉండటం మంచిది. వర్షాకాలపు తేమ వాతావరణంలో పాలు, పెరుగు, పనీర్‌ వంటి పాల ఉత్పత్తులలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి వీటిని చాలా వరకు తగ్గించి తీసుకోవాలి. అలాగే చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీ ఫుడ్‌, రెడ్‌ మీట్‌ కలుషితం కావడానికి అవకాశం ఎక్కువగా కాబట్టి. వీటిని కూడా కాస్త దూరం పెట్టాలి. వీటిలో వర్షం ప్రభావంగా బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు కూడా కలుషితమవుతుంది. కాబట్టి ట్యాప్‌ నుంచి వచ్చిన వాటర్‌ను నేరుగా తగకుండా.. వేడి చేసుకుని తాగాలి. అప్పుడే రోగనిరోధక శక్తి తగ్గకుండా ఉంటుంది.

Next Story