Children Superfood: పిల్లల ఏకాగ్రతను పెంచే సూపర్ ఫుడ్స్
పిల్లలు శారీరక, మానసికంగా ఎదిగేందుకు వారి బాల్యం నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే వారికి మంచి ఆహారం అందిస్తే...
By - అంజి |
Children Superfood: పిల్లల ఏకాగ్రతను పెంచే సూపర్ ఫుడ్స్
పిల్లలు శారీరక, మానసికంగా ఎదిగేందుకు వారి బాల్యం నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే వారికి మంచి ఆహారం అందిస్తే వారు పోటీ ప్రపంచంలో రాణించగల్గుతారు. దీనికోసం విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా గల ఆహారాన్ని పిల్లలకు అందించాలి. కొన్ని రకాలైన ఆహారాపదార్థాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎత్తు, బలం, మెదడు పనితీరు పెరగడం వంటి ఉపయోగాలుంటాయి . మరీ పిల్లలకు ఎంతో ఉపయోగకరమైన ఆ సూపర్‌ఫుడ్‌లు ఏంటో తెలుసుకుందాం.
1. గుడ్లు
గుడ్లలో ప్రోటీన్, విటమిన్-బి, విటమిన్-డి, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకుంటే పిల్లల శారీరక, మానసిక పెరుగుదల పెరుగుతుంది. దాని వల్ల మనస్సు చురుకుగా మారుతుంది. కాబట్టి పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు తప్పనిసరిగా తినిపించాలి.
2. పాలు
పాలలో భాస్వరం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలు, గోర్లు, దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి. విటమిన్ డీ లోపం కూడా పాలతో తీరిపోతుంది. కాబట్టి పాలు తాగితే పిల్లలకు కాల్షియం, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.
3. అరటి
అరటిలో విటమిన్ బీ6, విటమిన్ సీ, విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, బయోటిన్, ఫైబర్ లాంటి పోషకాలు ఉంటాయి. అంతేకాదు దీనిలో అధిక మొత్తంలో గ్లూకోజ్ ఉంటుంది. పిల్లలు అరటిపండును తింటే కడుపు, జీర్ణక్రియ రెండూ మంచిగా ఉంటాయి.
4. డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. కాబట్టి పిల్లలకు రోజూ బాదం, జీడిపప్పు, అత్తిపండ్లు, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను అందించాలి. ఇవి పిల్లలకు శక్తిని కూడా అందిస్తాయి.
5. పండ్లు, ఆకుపచ్చ కూరగాయాలు
పండ్లు, ఆకుపచ్చ కూరగాయాల్లో పిల్లలకు కావాల్సిన అన్ని విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి వీటిని చిన్నపిల్లల డైట్‌లో తప్పకుండా చేర్చాలి. వీటిని తినడం ద్వారా పిల్లలు అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
6. ఓట్స్, గంజి
ఓట్స్, గంజీతో పిల్లలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఓట్స్‌లో కరిగే ఫైబర్, బీటా- గ్లూకాన్ ఉండటం వల్ల గుండె జబ్బులు దరిచేరవు. ఇక గంజి తినడం ద్వారా పిల్లల కడుపు క్లీన్‌గా ఉంటుంది. అలాగే పిల్లలు బరువు పెరుగుతారు.
7. దుంపలు
దుంపల్లో ఫైబర్, కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. అందుకే చిలగడదుంపలు, బంగాళాదుంపలు తప్పనిసరిగా పిల్లలకు తినిపించాలి. చిలగడదుంపలు తినడం ద్వారా పిల్లలు పుష్కలంగా శక్తిని పొందుతారు.
8. బెర్రీలు
బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే పొటాషియం, విటమిన్ సీ, ఫైబర్, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి ఉండవు. ఇవి మనస్సు, శరీరాన్ని బలంగా చేయడంలో సహాయపడతాయి. కాబట్టి పిల్లల ఆహారంలో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు ఉండేలా చూసుకోవాలి.