అల్జీమర్స్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహారం తీసుకోండి

వయసు మీద పడేకొద్దీ వృద్ధుల్లో అల్జీమర్స్‌ (మతిమరుపునకు సంబంధించిన వ్యాధి) లక్షణాలు తీవ్రం అవుతూ ఉంటాయి.

By అంజి  Published on  16 Feb 2025 12:47 PM IST
lifestyle, foods, Alzheimer, Alzheimer patients

అల్జీమర్స్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహారం తీసుకోండి 

వయసు మీద పడేకొద్దీ వృద్ధుల్లో అల్జీమర్స్‌ (మతిమరుపునకు సంబంధించిన వ్యాధి) లక్షణాలు తీవ్రం అవుతూ ఉంటాయి. మెదడులోని కణాలు నశించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ కణాలు నశించకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆకుకూరల్లో విటమిన్‌ కే, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ కే మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా మెదడు నరాల చుట్టూ ఉండే మైలిన్‌ అనే రక్షణ కవచం ఏర్పడటంలో సహకరిస్తుంది.

బచ్చలికూర, క్యాబేజీ, ఓట్స్‌, గోధుమలు, చిలగడదుంపలు, నారింజ, కివి, సాల్మన్‌ చేప, ట్యూనా చేపలు అల్జీమర్స్‌ ముప్పును తగ్గిస్తాయి.

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. కోడి, మేక మంసాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని అవకాశాన్ని బట్టి ఆహారంలో భాగం చేసుకోవాలి.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, వాల్‌నట్స్‌, బాదంలో ఉండే కొవ్వులు, విటమిన్‌ ఈ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే పసుపు పొడి కూడా అల్జీమర్స్‌ ముప్పును చాలా వరకు తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

ప్రాసెస్‌ చేసిన మాంసం, అల్ట్రా ప్రాసెస్‌ ఆహార పదార్థాలు, చక్కెర, శుద్ధి చేసిన ధాన్యాలకు దూరంగా ఉండాలి.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. ఇక్కడ తెలియజేస్తున్నాం.)

Next Story