ప్రతిరోజు బెల్లం తింటే జరిగే మార్పులను నమ్మరు !

పూర్వం చాలా మంది బెల్లంను ఏదో రకంగా ఆహార పదార్థాల్లో చేర్చుకునేవారు. బెల్లంతో ఇంట్లో రకరకలా వంటకాల్ని తయారుచేసుకోని తినేవారు.

By -  అంజి
Published on : 24 Jan 2026 6:21 PM IST

Health benefits, eating jaggery, jaggery

ప్రతిరోజు బెల్లం తింటే జరిగే మార్పులను నమ్మరు !

పూర్వం చాలా మంది బెల్లంను ఏదో రకంగా ఆహార పదార్థాల్లో చేర్చుకునేవారు. బెల్లంతో ఇంట్లో రకరకలా వంటకాల్ని తయారుచేసుకోని తినేవారు. కానీ ప్రస్తుత కాలంలో బెల్లం వాడకం బాగా తగ్గిపోయింది. కనీసం పండుగల సందర్భల్లోనూ బెల్లం వంటకాలు చేయడం లేదు. బెల్లం బదులు చక్కెరతో చేసిన వంటకాల్ని వండేస్తున్నారు. అయితే ఇలా బెల్లం వాడాకాన్ని తగ్గించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. బెల్లం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయని, అందుకే పూర్వం బెల్లంను ఎక్కువగా తీసుకునేవారని చెబుతున్నారు.

* బెల్లంలో ఐర‌న్‌, ఫోలేట్‌లు స‌మృద్దిగా ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తింటే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ఎర్ర ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం బెల్లం తింటే మంచిది.

* బెల్లం తినడం వల్ల శ్వాస నాళాలు శుద్ధి అవుతాయి. దీంతో సాధారణ జలుబు, దగ్గు, గ్యాస్, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా బెల్లం కలిపి లేదా టీలో చక్కెరకు బదులుగా బెల్లం వేసి తీసుకుంటే మంచిది.

* మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం బెల్లం తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ మింగితే మలబద్దకం సమస్య పోతుంది.

* శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టకు పంప‌డంలో బెల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశ‌యం, ఆహార నాళం అన్నీ శుభ్ర‌మ‌వుతాయి. అందుక‌నే ఫ్యాక్ట‌రీల‌లో దుమ్ము, ధూళి న‌డుమ ప‌నిచేసే కార్మికులు బెల్లంను తినాలని సూచిస్తారు.

* బెల్లం స‌హ‌జ‌సిద్ధ‌మైన క్లీనింగ్ ప‌దార్థంలా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. అందులో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

* బెల్లం అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు స‌హాయ ప‌డుతుంది. నిత్యం భోజ‌నం చేశాక దీన్ని మ‌ధ్యాహ్నం, రాత్రి తిన‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా అధిక బ‌రువు సమస్య నుంచి బయటపడతారు.

* బెల్లం తీసుకోవడం వల్ల మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు తగ్గుతాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి శ‌రీరాన్ని, మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తాయి. రుతు స‌మ‌యంలో స్త్రీలు బెల్లంను రోజూ తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది.

* హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు, ఆర్థ‌రైటిస్‌, కీళ్ల స‌మ‌స్య‌లు, నొప్పులు, వాపులు ఉన్న‌వారు నిత్యం బెల్లం తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అంతేకాదు శ‌రీరానికి త‌క్ష‌ణ‌మే శ‌క్తి కావాల‌ని అనుకునేవారు, బాగా అల‌స‌ట చెందిన వారు బెల్లంను తిని ఒక గ్లాస్ నీటిని తాగితే వెంట‌నే శ‌క్తి ల‌భిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Next Story